మన స్టార్ డైరెక్టర్ రాజమౌళిని చూసి కొంతమంది బాలీవుడ్ మేధావులు ఓర్వలేకపోతున్నారు. జక్కన్న ఎన్వైసీసీ పురస్కారం అందుకున్న తర్వాత మరింత కడుపు మంటతో రగిలిపోతున్నారు. రాజమౌళి భారతీయ చిత్రాన్ని ఆర్ఆర్ఆర్ సినిమాని ఆస్కార్ లో నిలవాలని ఎంత కృషి చేస్తున్నారో మనకి కనిపిస్తూనే ఉంది. జనరల్ కేటగిరి విభాగంలో ఆస్కార్ కి నామినేట్ చేయాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. జక్కన్న ఇంతలా కష్టపడుతుంటే కొంతమంది మేధావుల తీరు చూస్తుంటే ఆయన్ని వెనక్కి లాగుతున్నట్లే కనిపిస్తోంది. బాలీవుడ్ లో కొంతమంది దర్శకులు, రచయితలు అంతా కలిసి చేస్తున్న పనే ఇది. ఆయనపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వాళ్ల వ్యవహార శైలి చూస్తుంటే రాజమౌళి అభిమానుల్ని ఆగ్రహించేలా చేస్తుంది. ప్రముఖ రచయిత పైన అసిన్ చాప్రా రాజమౌళి నవ్వుల పాలు చేసేలా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈయన ఇండియా నుంచి వెళ్లి న్యూయార్కులో స్థిరపడి బాలీవుడ్లో సినిమాలు చేస్తూ ఉన్నారు.
రాజమౌళి కి ఇష్టమైన పది హాలీవుడ్ సినిమాల గురించి ఓ బ్రిటన్ పత్రిక ప్రచురించగా వాటిని షేర్ చేసి అందులో ఫారెస్ట్ గంప్ ది లయన్ కింగ్ సినిమాల్ని ప్రజలంతా ఒకసారి గమనించాలి అంటూ టాగ్ చేసాడు. హాలీవుడ్ నుంచి రాజమౌళికి వస్తున్న గుర్తింపుకి ఓ సెటైర్ల ట్రీట్ చేశాడు. Why is he so angry with SS Rajamouli ఆయన ఇలా చేశాడంటే ఆయన ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడో కూడా ప్రజలంతా ఒకసారి గమనించాల్సింది. రాజమౌళి అంచనా తప్పే అయిన సినిమాకు అవార్డు ఎలా వస్తుంది. ఏ సినిమాకి అయినా మెరిట్ ఆధారంగా అవార్డు వస్తుంది. అలాంటప్పుడు తనకు నచ్చిన సినిమాల ఎంపికకు దానికి సంబంధం ఏంటి అంటూ రివర్స్ పంచ్ పడింది. ముందు బాలీవుడ్ కి సరైన హిట్ ఇవ్వండి ఆ తర్వాత సౌత్ సినిమాలతో ఎలా పోటీపడాలి ఆలోచించండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.