‘ఇప్పటిదాకా ఓ యెత్తు.. ఇంకపై ఇంకో యెత్తు.. కొత్త అనిల్ రావిపూడిని చూడబోతున్నారు..’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి తాను బాలకృష్ణతో తెరకెక్కించిన సినిమా గురించి చాలా సందర్భాల్లో చాలా చాలా ఎక్సయిటెడ్‌గా చెబుతూ వచ్చాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇప్పటిదాకా కామెడీ సెంట్రిక్ మూవీస్ తెరకెక్కించాడు. ‘ సరిలేరు నీకెవ్వరు ‘ లాంటి సూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్, నందమూరి బాలకృష్ణతో చేయబోయే సినిమా ఎలా వుండబోతోందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
బాలయ్యతో సమ్‌థింగ్ స్పెషల్… ‘నా జోనర్ నుంచి కాస్త పక్కకు వచ్చి, బాలయ్య తో సినిమా చేయబోతున్నాను..’ అని తొలుత ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అనిల్ రావిపూడి. అయితే, అనిల్ మార్కు ఎంటర్టైన్మెంట్‌నీ బాలయ్య కోరుకోవడంతో, తొలుత అనుకున్న కథలో చిన్న చిన్న మార్పులు చేయాల్సి వచ్చిందట. రేపే సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీలీల ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేయబోతోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి