UPDATES  

 BJPలో ఆసక్తికర చర్చ.!

మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఇమడలేకపోతున్నారా.? పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, ఈటెల రాజేందర్ బీజేపీ భావజాలాన్ని ఒంటపట్టించుకోవడంలో ఒకింత ఇబ్బంది పడుతున్నారట.. ఆ మాటకొస్తే, పూర్తిస్థాయి నిర్లక్ష్యం పార్టీ పట్ల ఈటెల రాజేందర్‌లో పెరిగిపోయిందన్న ఆరోపణలూ లేకపోలేదు. ఇవన్నీ ఓ యెత్తు.. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ కి వ్యతిరేకంగా ఈటెల రాజేందర్ పావులు కదుపుతున్నారన్న విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అయితే, పార్టీలో తనకు ఎవరి పట్లా వ్యతిరేకత లేదంటూ పలుమార్లు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం ఈటెల చేస్తున్నారు. బండి సంజయ్ అంటే ఎందుకంత అక్కసు.? సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు చూస్తుంటాం. కానీ, ఇక్కడ.. కాస్తంత భిన్నంగా బీజేపీలో గ్రూపు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు ఈటెల రాజేందర్. బండి సంజయ్‌కి వ్యతిరేకంగా ఓ గ్రూపుని తయారు చేసి, బండి సంజయ్ మీద బీజేపీ అధిష్టానానికి ఈటెల రాజేందర్ ఫిర్యాదు చేయించినట్లు ఆరోపణలున్నాయి.

అయితే, ఎక్కడా నేరుగా తన పేరు ఈ విషయంలో ప్రస్తావనకు రాకుండా ఈటెల రాజేందర్ తనదైన చాణక్యం ప్రదర్శించారన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన. ఈ వ్యవహారంపై బండి సంజయ్‌కి కూడా సమాచారం అందినా, ఆయన అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్టీ మేలు కోరి, ఈటెల వ్యవహారం బట్టబయలు కాకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ భావజాలమే అర్థం కాలేదు.. ఈటెల రాజేందర్ ఆర్ఎస్ఎస్ మూలాలున్న వ్యక్తి కాదు. హిందుత్వం ఎజెండాగా రాజకీయాలు చేసిందీ లేదు. కమ్యూనిస్టు భావజాలం వున్న ఈటెల రాజేందర్ బీజేపీలో మనుగడ సాధించడం కష్టమే. ఆ విషయం ఆయనకీ తెలుసు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆయన బీజేపీ తలుపుతట్టారు. కాగా, ఈటెల రాజేందర్ ఇటీవల మంత్రి కేటీయార్‌ని కలిశారనే ప్రచారం జరుగుతోంది. హేచరీస్ వ్యవహారమై సీక్రెట్‌గా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీయార్‌తో ఈటెల భేటీ అయ్యారట. ఈ విషయమై బీజేపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈటెల గులాబీ పార్టీ వైపు వెళ్ళబోతున్నారన్న ప్రచారం, కేటీయార్‌తో ఈటెల భేటీ తర్వాతే షురూ అయ్యింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !