UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 అనిల్ రావిపూడి బాలయ్య మూవీ: రేపే ప్రారంభం.!

‘ఇప్పటిదాకా ఓ యెత్తు.. ఇంకపై ఇంకో యెత్తు.. కొత్త అనిల్ రావిపూడిని చూడబోతున్నారు..’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి తాను బాలకృష్ణతో తెరకెక్కించిన సినిమా గురించి చాలా సందర్భాల్లో చాలా చాలా ఎక్సయిటెడ్‌గా చెబుతూ వచ్చాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇప్పటిదాకా కామెడీ సెంట్రిక్ మూవీస్ తెరకెక్కించాడు. ‘ సరిలేరు నీకెవ్వరు ‘ లాంటి సూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్, నందమూరి బాలకృష్ణతో చేయబోయే సినిమా ఎలా వుండబోతోందో ఊహించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.

బాలయ్యతో సమ్‌థింగ్ స్పెషల్… ‘నా జోనర్ నుంచి కాస్త పక్కకు వచ్చి, బాలయ్య తో సినిమా చేయబోతున్నాను..’ అని తొలుత ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అనిల్ రావిపూడి. అయితే, అనిల్ మార్కు ఎంటర్టైన్మెంట్‌నీ బాలయ్య కోరుకోవడంతో, తొలుత అనుకున్న కథలో చిన్న చిన్న మార్పులు చేయాల్సి వచ్చిందట. రేపే సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీలీల ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేయబోతోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి

   TOP NEWS  

Share :

Don't Miss this News !