UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి SUPER STAR మహేష్‌ బాబు

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ఇప్పటికే మల్టీప్లెక్స్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలుసు కదా. హైదరాబాద్‌లో ఏఎంబీ సినిమాస్‌ పేరుతో చాలా రోజుల కిందటే ప్రారంభమైంది. ఇది సిటీలోని టాప్‌ మల్టీప్లెక్స్‌లలో ఒకటి. ఇక ఇప్పుడు అతడు రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి కూడా అడుగు పెడుతున్నాడు. అంతేకాదు గురువారమే (డిసెంబర్‌ 8) తొలి రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఈ రెస్టారెంట్‌ ఉంది. దీనికి ఏఎన్‌ (AN) అనే పెట్టారు. ఏఎంబీ అంటే ఏషియన్‌ మహేష్‌ బాబు. ఇక ఇప్పుడు ఏఎన్‌లో ఏ అంటే ఏషియనే. మరి ఎన్‌ అంటే ఎవరో తెలుసా? నమ్రతా షిరోద్కర్‌. తన భార్య పేరు మీదుగా అతడీ రెస్టారెంట్‌ ప్రారంభిస్తున్నాడు. ఏషియన్‌ సునీల్‌ నారంగ్‌తో కలిసి మల్టీప్లెక్స్‌లోకి దిగిన అతడు.. ఇక ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ నారంగ్‌తోనే చేతులు కలుపుతున్నాడు.

ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో కలిసి ఎస్‌ఎస్‌ఎంబీ 28 మూవీ చేస్తున్న మహేష్.. ఆ బిజీలోనే రెస్టారెండ్‌ బిజినెస్‌లోకి దిగుతుండటం విశేషం. ఈ సినిమాకు పదే పదే అంతరాయాలు ఏర్పడుతున్నాయి. మొదట స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణంతో కొన్నాళ్లు ఆగింది. ఇక ఇప్పుడు ఓ యాక్షన్‌ సీన్‌ను సినిమాలో నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యే ముంబైలో ఎస్‌ఎస్‌ఎంబీ 28 టీమ్‌ కలిసింది. వీళ్లు హోమ్‌ ఫుడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఫొటో వైరల్‌ అయింది. ఈ ఫొటోలను నమ్రతా షేర్‌ చేసుకుంది. ఈ ఎస్‌ఎస్‌ఎంబీ 28లో పూజా హెగ్డే ఫిమేల్‌ లీడ్‌లో కనిపిస్తోంది. తమన్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్‌.. రాజమౌళితో కలిసి ఓ పాన్‌ వరల్డ్‌ ప్రాజెక్ట్‌ చేయనున్న విషయం తెలిసిందే. హాలీవుడ్‌ టెక్నీషియన్లు కూడా ఉండనున్న ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !