UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 వాల్తేర్‌ వీరయ్య ప్రపంచవ్యాప్తంగా జనవరి 13, 2023న రిలీజ్

గాడ్‌ఫాదర్‌ గ్రాండ్‌ సక్సెస్‌తో ఊపు మీదున్న మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు. ఈసారి వాల్తేర్‌ వీరయ్య మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను బుధవారం (డిసెంబర్‌ 7) మేకర్స్‌ అధికారికంగా అనౌన్స్‌ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 13, 2023న రిలీజ్‌ కానుంది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. బాలయ్య వీర సింహా రెడ్డి రిలీజ్‌ అయిన మరుసటి రోజే వాల్తేర్ వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ.. మేకర్స్‌ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. “ఈ సంక్రాంతికి థియేటర్లలో మాస్‌ మూలవిరాట్‌ దర్శనం.

వాల్తేర్‌ వీరయ్య ప్రపంచవ్యాప్తంగా జనవరి 13, 2023న రిలీజ్ అవుతోంది” అని మేకర్స్‌ ప్రకటించారు. వాల్తేర్‌ వీరయ్య మూవీలో చిరంజీవి సరసన శృతి హాసన్‌ నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తుండగా.. ఈ మధ్యే మూవీ నుంచి బాస్‌ పార్టీ అనే సాంగ్‌ కూడా వచ్చింది. ఇందులో లుంగీ పైకెత్తుకుంటూ వస్తూ ఊర మాస్‌ అవతారంలో చిరంజీవి కనిపించాడు. ఆచార్య డిజాస్టర్‌ తర్వాత గాడ్‌ఫాదర్‌ మెగా సక్సెస్‌తో మళ్లీ గాడిలో పడిన మెగాస్టార్‌.. ఇప్పుడీ వాల్తేర్‌ వీరయ్యపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. అయితే సంక్రాంతి పోటీని తట్టుకొని ఈ సినిమా ఎలా నిలుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి ఈ సినిమాకు గట్టి పోటీగా నిలిచే అవకాశం ఉంది. బాలకృష్ణతోపాటు మాస్‌ మహారాజా రవితేజ నటిస్తున్న వీర సింహా రెడ్డి జనవరి 12న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన జై బాలయ్య సాంగ్‌ కూడా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !