UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 BBC ప్రభావశీలురైన మహిళల లిస్ట్‌లో PRIYANKA CHOPRA, SHIRISHA BANDLA

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన నటి ప్రియాంకా చోప్రా. సింగర్, యాక్టర్ అయిన నిక్‌ జొనాస్‌ను పెళ్లి చేసుకొని ఆమె లాస్‌ ఏంజిల్స్‌లోనే సెటిలైపోయింది. తాజాగా బీబీసీ 2022కుగాను రిలీజ్‌ చేసిన 100 మంది ప్రభావశీలురైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ లిస్ట్‌లో మొత్తం నలుగురు భారతీయులు ఉండగా.. అందులో బాలీవుడ్‌ నుంచి ప్రియాంకాకు మాత్రమే చోటు దక్కింది. ఇక స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన మన తెలుగు వనిత, ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ శిరీష బండ్ల, బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న రచయిత్రి గీతాంజలి శ్రీ, సోషల్‌ వర్కర్‌ స్నేహ జవాలే కూడా ఇందులో ఉన్నారు. బాలీవుడ్‌లో 60కిపైగా సినిమాలతో పెద్ద ఫిల్మ్‌ స్టార్‌లలో ఒకరిగా ఆమెను అభివర్ణించారు. “2022లో ప్రియాంకా తన యాక్టింగ్ కెరీర్‌ ప్రారంభించింది.

ఇక 2015లో అమెరికన్‌ నెట్‌వర్క్ డ్రామా సిరీస్‌ క్వాంటికోలో లీడ్‌ రోల్‌ పోషించిన తొలి దక్షిణాసియా మహిళగానూ నిలిచింది. ఆ తర్వాత ఈజ్‌ ఇంట్‌ ఇట్‌ రొమాంటిక్‌, ది మాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌లాంటి సినిమాల్లోనూ నటించింది. సొంతంగా ఓ ప్రొడక్షన్‌ కంపెనీ ప్రారంభించి ఇండియాలో సినిమాలు కూడా తీస్తోంది” అని బీబీసీ తెలిపింది. ఈ 100 మంది లిస్ట్‌లో మన తెలుగు వనిత శిరీష బండ్లకు కూడా చోటు దక్కడం గమనార్హం. వర్జిన్‌ గెలాక్టిక్‌లో వైస్‌ ప్రెసిడెంట్‌గా చేస్తున్న ఆమె.. ఆ సంస్థ ఛైర్మన్‌ బ్రాన్సన్‌తో కలిసి స్పేస్‌లోకి వెళ్లి వచ్చింది. గుంటూరుకు చెందిన ఆమె.. చిన్నతనంలోనే అమెరికాలోని హూస్టన్‌కు వెళ్లింది. అక్కడే ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివి వర్జిన్‌ గెలాక్టిక్‌లో పని చేస్తోంది. గతేడాది జులై 11న ఆమె మరో ఐదుగురితో కలిసి వర్జిన్‌ గెలాక్టిక్‌కు చెందిన యూనిటీ 22 టెస్ట్‌ ఫ్లైట్‌లో స్పేస్‌లోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !