UPDATES  

NEWS

 ప్రస్తుతం సమంతకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్

ప్రస్తుతం సమంతకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం సమంత వయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి దక్షిణ కొరియా వెళ్లినట్లు సమాచారం వచ్చింది. సమంత పాన్ ఇండియా స్థాయిలో నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అరుదైన వ్యాధి మయోసైటిస్తో బాధపడుతున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన సమంత తన ఆరోగ్యం బాగుపడినట్లు క్లారిటీ వస్తుంది. దీంతో ఆమె త్వరలోనే ఖుషి సినిమా రెండో షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో ఓ యంగ్ హీరోయిన్ సమంత జీవితానికి అతిపెద్ద దరిద్రంగా మారిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విడాకులు తీసుకున్న కొత్తలో కూడా సమంత పరోక్షంగా టార్గెట్ చేసిన ఈ బ్యూటీ, సమంత సినిమా అవకాశాలను లాక్కోవాలని ప్రయత్నిస్తుందట.

నిజానికి సమంత మయోసైటీస్ వ్యాధితో బాధపడటంతో ఇండస్ట్రీ అంతా ఎంతో బాధపడ్డారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ఈ హీరోయిన్ మాత్రం అక్కినేని ఇంటితో బాగా కలిసిపోయి సమంత పై ఒక్క పాజిటివ్ కామెంట్ కూడా చేయలేదు. young beauty target Samantha అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి అడిగితే చెప్పకుండా తప్పించుకుంది. అలాంటి ఆ యంగ్ హీరోయిన్ సమంతకు బాగాలేదని తెలుసుకొని ఆ సినిమాలో ఆఫర్ అందుకోవడానికి తెగ ట్రై చేస్తుంది. కాని డైరెక్టర్ సమంత ఎప్పుడు వస్తే అప్పుడు సినిమా తీస్తామని చెప్పడంతో ఆమె అనుకున్నది జరగడం లేదు. అంతేకాదు ఆ సినిమా లో నటించబోతున్న హీరోని సీక్రెట్ గా కలిసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. సమంతను తొక్కడానికి నానా విధాలుగా ట్రై చేస్తుంది కాని అనుకున్నది ఏమి జరగడం లేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు మీకు అర్థం అయ్యే ఉంటుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !