UPDATES  

 AP : గురువారం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం

ఏపీలో ఎన్నికల వే’ఢీ’రాజుకుంది. అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. రెండేళ్ల ముందు నుంచే హడావుడి ప్రారంభమైనా.. ఇటీవల మాత్రం మరింత ఎక్కువైంది. ముఖ్యంగా అధికార వైసీపీ బీసీ గర్జనతో ఎన్నికల సంకేతాలిచ్చింది. ఇదే వేదికపై నుంచి జగన్ ముందస్తుపై స్పష్టమైన సంకేతాలిచ్చారు. తాను ఎన్నికలకు సిద్ధంగా ఉండడమే కాకుండా.. పోరాటం చేయాలని కూడా పిలుపునిచ్చారు. అదే స్పీడుతో గురువారం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సమావేశం కానున్నారు. కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేయనున్నారు. చాలా మంది సిట్టింగ్ ల స్థానాలను మార్చనున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించిన నేపథ్యంలోవారందర్నీ ఇదే వేదికపై పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది. pawan kalyan, chandrababu, jagan ప్రధాన విపక్ష నేత చంద్రబాబు కూడా తాము ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అటు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పర్యటనలతో జిల్లాలను చుట్టేస్తున్నారు.ఒక వైపు పొత్తులు, మరోవైపు ఎమ్మెల్యే సీట్లు కేటాయింపుపై కూడా దృష్టిపెట్టారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు కన్ఫర్మ్ చేశారు. పన్నులు, చార్జీల పెంపుపై చేపట్టిన బాదుడే బాదుడు సక్సెస్ కావడంతో పార్టీలో కూడా ఒక రకమైన చేంజ్ వచ్చింది.

పార్టీ శ్రేణులు కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాయి. ఇప్పుడు ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారు. ఇది సక్సెస్ ఫుల్ గా రన్నవుతోంది. మరోవైపు పొత్తుల అంశాన్ని సజీవంగా ఉంచుతూనే.. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికలు పార్టీతో పాటు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య కావడంతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అటు నారా లోకేష్ సైతం పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ సైతం తాను ఎన్నికలకు సిద్ధమేనని సంకేతాలిస్తున్నారు. అటు వీలైనంత త్వరగా పెండింగ్ సినిమాలను పూర్తిచేసి పొలిటికల్ గా యాక్టివ్ కావాలని భావిస్తున్నారు. ఇప్పటికే నెలలో నాలుగైదు సార్లు వచ్చి సమస్యలను అజెండాగా తీసుకొని పోరాటం చేస్తున్నారు. పండుగ తరువాత బస్సు యాత్రకు సిద్ధపడుతున్నారు. అన్నిరకాల సన్నాహాలు పూర్తిచేశారు. ఎన్టీఆర్ చైతన్య రథం తరహాలో.. ఆర్మీ వెహికల్ మాదిరిగా రూపొందిస్తున్నారు. అటు పవన్ టూర్ కి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధం చేసే పనిలో హైకమాండ్ ఉంది. దాదాపు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రధాన ప్రాంతాలను కలుపుతూ షెడ్యూల్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడనుంది. pawan kalyan, chandrababu, jagan అటు జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు సైతం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించినా ఇండిపెండెంట్ గా వెళ్లే అవకాశమేమీ లేదు. అటు బీజేపీ కోసం టీడీపీ, జనసేనలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అధికార వైసీపీ కూడా మూడు పార్టీలు కలిసే పోటీచేస్తాయని చెబుతూ వస్తోంది. కానీ బీజేపీ ఏ విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. తాము కేవలం జనసేనతో మాత్రమే నడుస్తామని మాత్రమే స్పష్టం చేసింది. అయితే దీనిపై కొద్దిరోజులు గడిస్తే కానీ స్పష్టత రాదు. అటు కాంగ్రెస్ పార్టీ ఒంటరి ప్రయాణమే చేస్తోంది. ఆ పార్టీకి కొద్దొ గొప్ప క్యాడర్ ఉంది. మెజార్టీ కేడర్ వైసీపీ వైపు మళ్లింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అవసరం ఏ పార్టీకీ లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పార్టీలు ఎన్నికలపై ఫోకస్ పెంచాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !