UPDATES  

 . సుమారు 140 స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాల్నీ తల్లకిందులు చేస్తూ బీజేపీ ఘనవిజయం సాధించబోతోంది. ఫలితాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా, ఆ పరిస్థితి లేదు. బీజేపీ అనూహ్యంగా దుమ్మురేపుతోంది. మరోమారు బీజేపీలో అధికారాన్ని దక్కించుకోబోతోంది. నిజానికి, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రభావం చూపొచ్చనే అభిప్రాయం గతంలో రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపించింది. ఢిల్లీ, పంజాబ్ తరహాలో గుజరాత్‌లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటుతుందని అంతా అనుకున్నారు. బీజేపీకి తిరుగులేదంతే.. వరుసగా ఏడోసారి బీజేపీ గుజరాత్‌లో అధికారంలోకి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈసారి మరింత బంపర్ విక్టరీ బీజేపీ నమోదు చేయబోతోంది. సుమారు 140 స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం చూపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 20 స్థానాలకే పరిమితమయ్యేలా వుంది. ఆమ్ ఆద్మీ పార్టీ డబుల్ డిజిట్ చేరుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. ‘గుజరాత్ భూమి పుత్ర మోడీ’ అనే నినాదం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపినట్లు కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ బంపర్ విక్టరీ సాధిస్తే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశంలో బీజేపీదే విజయమనే భావన రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమయిన దరిమిలా, ముచ్చటగా మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి రాబోతోందన్నమాట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !