UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 సులభమైన DELIVERY కోసం యోగా..

ప్రినేటల్ యోగా మీ గర్భధారణ కాలం అంతా మిమ్మల్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. మారుతున్న శరీరం, మూడ్ స్వింగ్‌లతో పాటు.. తరచుగా వాష్‌రూమ్‌కి వెళ్లడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతారు. అయితే గర్భధారణ సమయంలో యోగా ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. సులభంగా ప్రసవించే అవకాశాలను పెంచుతుంది అంటున్నారు నిపుణులు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. గర్భధారణ సమయంలో విటమిన్లు, ఖనిజాలతో కూడిన సరైన ఆహారంతో.. మంచి వ్యాయామ ప్రణాళిక చాలా అవసరం. అయితే శారీరక, మానసిక దృఢత్వాన్ని మెరుగుపరచడానికి.. ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేయడానికి ప్రినేటల్ యోగా ఒక గొప్ప మార్గం. బలాన్ని, శక్తిని పెంచుతుంది గర్భధారణ సమయంలో యోగా సాధన చేయడం వల్ల.. మీ భౌతిక శరీరం.. ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్, పొత్తికడుపు కోర్ కండరాలు, తుంటిని టోన్ చేయడంలో సహాయపడుతాయి. ఇది ప్రసవ ప్రక్రియకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. యోగా మీ కణజాలం, కండరాలను సాగదీయడంలో సహాయపడుతుంది. ఆక్సిజన్, రక్త ప్రసరణను ప్రోత్సహించేటప్పుడు మీ అవయవాలను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా మీ కడుపులో పెరుగుతున్న శిశువును మోయడానికి మీకు శక్తిని పెంచుతుంది. మీరు నీరసంగా ఉండకుండా.. హెల్తీగా ఉండేలా చేస్తుంది. సులభమైన ప్రసవం కోసం.. యోగా ఆసనాలలో మీరు లోతైన శ్వాసలు తీసుకుంటారు. ఇది మీలో ఉన్న ఒత్తిడి, భయాన్ని దూరం చేస్తుంది. మీ ఎమోషన్స్ కంట్రోల్ చేస్తూ.. మిమ్మల్ని శాంతపరుస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా సంకోచాలు ఉంటాయి. వాటిని నుంచి మీకు యోగా విశ్రాంతిని ఇస్తుంది. యోగా ఆసనాలు మీ పెల్విక్ ఫ్లోర్ కండరాలను సులభంగా ఉపయోగించడంలో సహాయపడతాయి. ఇది సహజ ప్రసవ సమయంలో శిశువును సమర్థవంతంగా, సాఫీగా నెట్టడానికి మీకు సహాయం చేస్తుంది. పుట్టబోయే బిడ్డతో అనుబంధాన్ని పెంచుతుంది యోగా మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది మీ శరీరాన్ని లోతైన స్థాయిలో ట్యూన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీకు, మీ బిడ్డకు మధ్య ఏమి జరుగుతుందో మరింత తెలుసుకునేందుకు యోగా సహాం చేస్తుంది.

శ్వాస, కండరాల బలాన్ని పెంచే భంగిమలు చేయడం వల్ల ఇది జరుగుతుంది. మీరు మీ శరీరం గురించి తెలుసుకున్నప్పుడు.. మీరు శిశువుతో బాగా కనెక్ట్ అవుతారు. డిప్రెషన్ నుంచి ఉపశమనం నిద్రలేమి, వికారం, నడుము నొప్పి, తలనొప్పులు, ఊపిరి ఆడకపోవడం మొదలైన వాటితో పాటు గర్భం చాలా అసౌకర్యాన్ని తెస్తుంది. వాటితో పాటు డిప్రెషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏమవుతుందో అనే భయం వల్ల, కుటంబ సమస్యల వల్ల కూడా ఈ డిప్రెషన్ రావొచ్చు. అయితే యోగా కండరాలను సాగదీయడం, టోన్ చేయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణకు అనుమతిస్తుంది. ఇది విశ్రాంతినిస్తూ.. మిమ్మల్ని ఉత్తేజపరచడంలో సహాయం చేస్తుంది. ఇది మీ బ్యాలెన్స్, వశ్యతను కూడా మెరుగుపరుస్తుంది. 2012లో చేసిన అధ్యయనం ప్రకారం.. మైండ్‌ఫుల్‌నెస్ యోగా మీ గర్భధారణ కాలం అంతటా జరిగే డిప్రెషన్ నుంచి ఉపశమనం అందిస్తున్నట్లు వెల్లడించింది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.. గర్భిణీ స్త్రీలు తరచుగా నిద్రలేమితో బాధపడుతుంటారు. నడుము నొప్పి, అసౌకర్యం, వాష్‌రూమ్‌కు తరచుగా వెళ్లడం వంటి కారణాలతో.. అర్ధరాత్రి నిద్రలేస్తూ అలసిపోతారు. అయితే యోగా మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది మీ నిద్రలేమిని దూరం చేస్తుంది. పరిశోధన ప్రకారం.. వారి రెండవ త్రైమాసికంలో యోగా, ధ్యానం సాధన చేసే మహిళలు రాత్రి సమయంలో తక్కువగా మేల్కొన్నట్లు గుర్తించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !