మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత బాలీవుడ్‌లో సినిమా చేయబోతున్నడు. బడే మియా చోటే మియాతో హిందీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా బడే మియా చోటే మియా సినిమా తెరకెక్కుతోంది.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించబోతున్నాడు. అమితాబచ్చన్, గోవిందా హీరోలుగా 1996లో రిలీజైన బడే మియా చోటే మియా సినిమాకు సీక్వెల్‌గా ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా రూపొందుతోంది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించనున్నాడు. అక్బర్ అనే క్యారెక్టర్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో అతడు మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నట్లు తెలిసింది. పృథ్వీరాజ్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా ఉంటుందని సమాచారం. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈసినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో హిందీ, తెలుగుతో పాటు తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. గతంలో బాలీవుడ్‌లో అయ్యా, ఔరంగజేబ్ సినిమాలు చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. బాలీవుడ్‌లో చివరగా తాప్సీ ప్రధాన పాత్రలో 2017లో రిలీజైన నామ్ షబానా సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించాడు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు.