UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 అఖండని మించి హిట్ .. వీర సింహా రెడ్డి.

గత ఏడాది డిసెంబర్ నెలలో నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇక ఆ సినిమా దాదాపుగా 200 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆ తర్వాత టెలివిజన్లో స్టార్ మా లో వరల్డ్ ప్రీమియం అయిన సమయంలో కూడా భారీ ఎత్తున రేటింగ్ సొంతం చేసుకుంది. దీంతో స్టార్ మా కి భారీగా లాభం వచ్చిందని టాక్ కూడా వచ్చింది.ఇక అఖండ సినిమాతో వచ్చిన లాభాలతో మరలా ఇప్పుడు బాలయ్య నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాని కూడా స్టార్ మా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల కాకముందే స్టార్ మా భారీ మొత్తంలో ఈ సినిమాను దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో మరియు బుల్లి తెర పై బాలయ్యకున్న ప్రజాదరణ మరియు , క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని స్టార్ మా ఈ సినిమాను గట్టి పోటీతో తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఇక ఇప్పటికీ స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న అఖండ సినిమాకు భారీ రేటింగ్ వస్తూనే ఉంది.

ఇక వీర సింహారెడ్డి సినిమా కూడా స్టార్ మా కు మంచి రేటింగ్ తెచ్చి పెట్టడం ఖాయం. అలాగే ప్రస్తుత కాలంలో ఓటీటీ లో స్ట్రీమింగ్ అయినా చాలామంది చూసిన తర్వాత సాటిలైట్ లో ఎక్కువగా చూడడం లేదు. అందుకే టెలివిజన్ రేటింగ్ గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువ అని చెప్పాలి. ఆయన కూడా వీర సింహారెడ్డి సినిమాను స్టార్ మా భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. స్టార్ మా ఈ సినిమా కొనుగోలు చేసింది..  కాబట్టి ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారు కొనుగోలు చేసింటారని తెలుస్తుంది. అయితే ఎక్కువ శాతం రెండు రైట్స్ స్టార్ మా వారు జాయింట్ గా కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ అఖండ సినిమా స్టార్ మా లో టెలికాస్ట్ అవ్వక ముందే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. కనుక వీర సింహారెడ్డి కూడా ఇలాగే టెలికాస్ట్ కాబోతున్నాయి అని అనుకుంటున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. శృతిహాసన్ హీరోయిన్గా బాలయ్య రెండు భిన్నమైన పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ సినిమాను యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నట్లు డైరెక్టర్ గోపీచంద్ గతంలో వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !