UPDATES  

 ‘కంటెండ్ ఉన్నోడికి కటౌట్ చాలు’

‘కంటెండ్ ఉన్నోడికి కటౌట్ చాలు’ గబ్బర్ సింగ్ సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్ ఇది. చెప్పింది కామెడీ జోనర్ లో నైనా ఇది ముమ్మాటికీ వాస్తవమే. కంటెంట్ ఉంటే ఎలాంటి వస్తువుకైనా శక్తి ఉంటుందని చెబుతూ పవన్ కళ్యాణ్ కటౌట్ తీసుకొచ్చి మరీ.. రాక్షస సేనగా ఉన్న విలన్ల బృందాన్ని భయపెట్టి మరీ బ్రహ్మానందం తన విధిని సక్సెస్ పుల్ గా ముగించుకుంటాడు. ఇప్పుడు ఏపీలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇంకా పవన్ యాత్ర మొదలు పెట్టలేదు. కానీ ఆయన ప్రచారానికి వినయోగించనున్న వారాహి వాహనం రాజకీయం మొదలు పెట్టింది. ప్రత్యర్థులను వణుకు పుట్టిస్తోంది. యుద్ధం ప్రారంభించే ముందు సైరన్ మోగిస్తోంది. ముఖ్యంగా వైసీపీ నేతలకు రీ సౌండ్ వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను గట్టి హెచ్చరిక చేస్తోంది. Pawan Kalyan Varahi జనసేన ప్రచార వాహనం ‘వారాహి’పై ఓ పద్ధతి ప్రకారం అధికార వైసీపీ విష ప్రచారం మొదలుపెట్టింది. కానీ అదే ప్రచారం వారి మెడకు చుట్టుకుంటోంది. వ్యవస్థలకే వైసీపీ రంగుపూసిన విధానంపై ఇప్పుడు జనసేన టార్గెట్ చేయడం ప్రారంభించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రభుత్వమే ఒక ఆయుధాన్ని జనసేన చేతిలో పెట్టినట్టయ్యింది. జనసేన అన్ని పార్టీల మాదిరిగా ఓ సంప్రదాయ పార్టీ, తన రాజజకీయ కార్యకలాపాల కోసం ఒక ప్రచార వాహనాన్ని తయారుచేసుకుంది. ఎలక్షన్ బ్యాటిల్ కోసం తనకు అనువైన రూపంలో, నిబంధనలకు లోబడి రూపొందించుకున్న వాహనం అది. కానీ దానిని కూడా లేనిపోని వివాదం చేసి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో పడిన వైసీపీకి అదే ప్రతికూలతను తెచ్చిపెట్టింది. వారాహి వెహికల్ కు వేసిన కలరే అభ్యంతరం అయినప్పుడు… ప్రభుత్వ భవనాలకు, చివరకు ప్రజా రవాణాకు సంబంధించి ఆర్టీసీని సైతం విడిచిపెట్టకుండా రంగులు మార్చిన విధానం ప్రజల్లో చర్చకు వస్తుంది. ఆ వాహనం పవన్ కష్టార్జితం. తాను సినిమాల ద్వారా సంపాదించుకున్న సొమ్ముతో తన అభిష్టానానికి అనుగుణంగా తయారుచేసుకున్న వాహనం అది. దానిని కూడా రాజకీయం చేయడం ఏమిటన్న ప్రశ్న ఏపీ సమాజంలో వినిపిస్తోంది. వారాహి వెహికల్ విషయంలో అధికార పార్టీ చేస్తున్న కామెంట్స్ ను బలంగా తిప్పికొట్టాలని జనసేన నిర్ణయించింది.

విశాఖలో జరిగిన జనసేన సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశంలో వివాదంపై ఫుల్ క్లారిటీతో మాట్లాడారు ఆ పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్. ప్రభుత్వ చర్యలను, వైసీపీ లేకితనంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ చర్యలపై ఘాటుగా వ్యాఖ్యానించారు. అటు జనసేన తరుపున కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయస్థానాల్లో లెక్కకు మించి మొట్టికాయలు పెట్టుకున్నావారంతా ఇప్పుడు నిబంధనల కోసం మాట్లాడడమేమిటని ప్రశ్నించారు. పవన్ ఎప్పుడు నిబంధనలకు లోబడి పనిచేస్తారని.. స్థాయికి తగినట్టు మాత్రమే వ్యవహరిస్తారని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఏ రంగు వేశారో చూడకుండా రవాణా శాఖ ఎలా అనుమతిస్తుందని కూడా ప్రశ్నించారు. ఇది వైసీపీ కావాలనే చేస్తున్న వివాదంగా అభివర్ణించారు. ఏపీఎస్ ఆర్టీసీని కాస్తా.. వైఎస్సార్ సీపీ ఆర్టీసీ గా మార్చిన విషయాన్ని జనసేన స్లోగన్ గా ఎంచుకుంది. ప్రజా రవాణాను స్తంభింపజేసి.. అధికార పార్టీ సేవల్లో తరించే విధంగా ఆర్టీసీని మార్చిన మీరా నిబంధనలు గురించి మాట్లాడేది అని కొత్త పల్లవిని అందుకుంది. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల డబ్బులతో రంగుల మార్చిన మీరా మాట్లాడేది అంటూ చురకలు అంటించింది. చివరకు బడి, గుడిని కూడా వదలని విషయాన్ని గుర్తుచేసింది. విపక్ష నేతగా పాదయాత్ర చేసినప్పుడు విద్యుత్ స్తంభాలను సైతం పార్టీ రంగులు వేసిన విషయాన్ని ప్రస్తావించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !