UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఆలివ్ గ్రీన్ రంగు.. యుద్ధానికి సన్నద్ధం.. అన్న ప్రచారం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘వారాహి’ అనే కారవాన్‌ని తయారు చేయించుకున్నారు. ఎన్నికల సమరానికి ఈ వాహనాన్ని వినియోగించనున్నారు జనసేనాని . ఆలివ్ గ్రీన్ కలర్‌లో వాహనం కనిపిస్తోంది. రాజకీయాల్లో ఇంతవరకు ఇలాంటి వాహనాన్ని ఏ రాజకీయ ప్రముఖుడూ వినియోగించలేదన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. గతంలో స్వర్గీయ ఎన్టీయార్ ‘చైతన్య రధాన్ని’ వినియోగించారు. ఆ తర్వాత కూడా రాజకీయ నాయకుల అవసరాల నిమిత్తం, ప్రత్యేక వాహనాల్ని రూపొందిస్తుండడం చూస్తూనే వున్నాం. అయితే, ఆలివ్ గ్రీన్ రంగు.. యుద్ధానికి సన్నద్ధం.. అన్న ప్రచారం.. వెరసి, ‘వారాహి’పై అనుమానాలు పెరుగుతున్నాయ్.

అనుమతులు అసాధ్యమట.. ఏపీకి చెందిన రవాణా శాఖ ఉనతాధికారి ఒకరు, మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను అనుసరించి, ఆలివ్ గ్రీన్ కలర్ వుంటే, ఆ వాహనానికి రిజిస్ట్రేషన్ కుదరదని తెలుస్తోంది. అంతే కాదు, వాహనం తాలూకు టైర్ దగ్గర్నుంచి, అన్ని విషయాల్లోనూ నిబంధనలు పక్కగా అమలవుతాయని తేల్చి చెప్పారాయన. అంటే, ఒక్క చిన్న అదనపు ఆకర్షణ.. ‘వారాహి’ని ఏపీలో తిరగకుండా చేయొచ్చన్నమాట. అలాంటిది, వాహనానికి చాలా మార్పులు చేసేశారు. సో, ఏదో ఒక వంక పెట్టి ఏపీలోకి వారాహి అడుగు పెట్టకుండా అధికార వైసీపీ చేయడానికి వీలుంది. అదే జరిగితే, జనసేన తదుపరి వ్యూహమెలా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !