UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగే అవకాశం లేదట…?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగే అవకాశం లేదట. ఆయన్ని తొలగించేస్తారట.! మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీలో కొందరు పనిగట్టుకుని బండి సంజయ్‌కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మరోపక్క, బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి దక్కనుందనీ, అలా బండి సంజయ్‌ని ట్రాక్ తప్పించబోతున్నారనీ ఇంకో రకమైన ప్రచారం జరుగుతోంది. టార్గెట్ బండి సంజయ్.! ఔను, గత కొంతకాలంగా బండి సంజయ్ మీద బీజేపీ లోనే ‘కుట్రలు’ జరుగుతున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణ బీజేపీకి బండి సంజయ్ కంటే ముందు చాలామంది నేతలు అధ్యక్షులుగా పని చేశారు. అయితే, వారెవరికీ రానంత క్రేజ్ తెలంగాణ బీజేపీలో బండి సంజయ్‌కి దక్కింది. తెలంగాణ బీజేపీ ఇమేజ్ పెంచిన బండి సంజయ్.. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా తెలంగాణ బీజేపీకి సంబంధించి ‘ బండి సంజయ్ కంటే ముందు.. బండి సంజయ్ వచ్చాక..’ అనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్‌తో తాడో పేడో తేల్చుకునేంత సత్తా కేవలం బండి సంజయ్‌కి మాత్రమే వుంది. అదే ఆయన్ని తెలంగాణ రాజకీయాల్లో సమ్‌థింగ్ స్పెషల్ అనుకునేలా చేసింది. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల సమయంలో బండి వ్యూహం నభూతోనభవిష్యతి.

అంతేనా, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనూ బండి సంజయ్ వ్యూహాలు అత్యద్భుతంగా పని చేశాయి. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికలో చివరి నిమిషంలో జరిగిన చిన్నపాటి గలాటా.. అది కూడా బీజేపీలో అంతర్గతంగా తలెత్తిన గలాటా వల్ల బీజేపీ, విజయాన్ని అందుకోలేకపోయింది. జాతీయ రాజకీయాల్లోకి బండి సంజయ్ వెళితే.. కేంద్ర మంత్రి పదవిని బండి సంజయ్ దక్కించుకోనున్నారన్న ప్రచారంలో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఆయన గనుక వెళితే.. తెలంగాణ రాజకీయాలపై ఆయన ఫోకస్ తగ్గుతుంది. ఇప్పటిలా పాదయాత్రలు చేయలేరు.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగడమూ కష్టమే. బండి సంజయ్ కాకపోతే ఇంకెవరు.? బీజేపీని బండి సంజయ్ తరహాలో నడిపే సత్తా తెలంగాణ బీజేపీలో ఎవరికి వుంది.? నిజానికి, ఎవరికీ లేదు. ఆ విషయం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా.. బీజేపీ జాతీయ నాయకులందరికీ తెలుసు. బండి సంజయ్‌కి వ్యతిరేకంగా ఓ వర్గం చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలో, బండి సంజయ్‌కి ప్రమోషన్ పేరుతో.. కేంద్ర మంత్రి పదవి ఇచ్చి సైడ్ ట్రాక్‌లో పంపిస్తే.. తెలంగాణలో బీజేపీ నష్టపోతుందన్నది నిర్వివాదాంశం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !