పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాని గతంలో అనౌన్స్ చేసింది. అయితే, అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది. కాగా, పవన్ కళ్యాణ్‌తో చేయబోయే సినిమాపై అప్డేట్ రాబోతోందంటూ తాజాగా హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. అంతే, పవన్ అభిమానుల్లో అలజడి బయల్దేరింది. రీమేక్ చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు సూచనలతో కూడిన హెచ్చిరకలు చేస్తున్నారు.
‘తెరీ’ రీమేక్ చేస్తున్నారా..? విజయ్, సమంత ప్రధాన పాత్రల్లో వచ్చిన తమిళ సినిమా ‘తెరి’ తెలుగులోకి ‘పోలీసోడు’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. దాన్నే రీమేక్ చేయబోతున్నారన్నది జరుగుతున్న ప్రచారం. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ‘మాకు రీమేక్ వద్దు.. ఒరిజినల్ సబ్జెక్ట్ కావాలి’ అంటూ హరీష్‌కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా సూసైడ్ లెటర్ రాసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నా చావుకి కారణం దర్శకుడు హరీష్ శంకర్, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్’ అని అందులో పేర్కొన్నాడు ఆ అభిమాని. మరి, హరీష్ ఈ విషయమై ఎలా స్పందిస్తాడో.!