అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘పుష్ప ది రైజ్’ సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ ‘పుష్ప ది రైజ్’కి కొనసాగింపు అయిన ‘పుష్ప ది రూల్’ ఎలా వుండబోతోంది.? ఈ విషయమై హీరోయిన్ రష్మిక మండన్న ఓ చిన్న హిట్ ఇచ్చింది. మొదటి పార్ట్‌కీ, రెండో పార్ట్‌కీ కొన్ని తేడాలుంటాయని చెప్పుకొచ్చింది. ప్రధానంగా లుక్స్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నారట. లుక్స్ మార్చితే ఎలాగబ్బా.? పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ , శ్రీవల్లి పాత్రలో రష్మిక మండన్న నటించారు.
పెళ్ళి దగ్గర ఆ ‘పుష్ప ది రైజ్’ కథ ఆగింది. దానికి కొనసాగింపు గనుక, గెటప్స్‌లో మార్పులు ఎలా వుంటాయబ్బా.? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. Some Changes Are Being Made In Getups For Pushpa 2 రష్మిక మాత్రం మార్పులుంటాయని అంటోంది. అయితే, అవి మరీ పెద్ద మార్పులు కావట. ఆ మార్పులేంటో తెలియాలంటే సినిమా తెరపై చూడాల్సిందేనని చెబుతోంది రష్మిక మండన్న. అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. ప్రస్తుతం పుష్ప టీమ్, రష్యాలో విడుదలైన ‘పుష్ప ది రైజ్’ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.