UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 వెంకటేష్ పెద్ద కూతురు యూట్యూబర్

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత యూట్యూబర్ అనే విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత విభిన్నమైన వంటకాలను యూట్యూబ్ ద్వారా జనాలకు ఈమె పరిచయం చేస్తుంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన హోటల్స్ మరియు రెస్టారెంట్స్ గురించి ఆమె వివరిస్తూ అందులో ఉన్న ఫుడ్ ను జనాలకు తెలియజేసే తీరు ఆకట్టుకుంటుంది. ఆమె వీడియో లో మాట్లాడే విధానం భలే ఉంటుందని అంతా అనుకుంటూ ఉంటారు. తాజాగా నాగచైతన్యతో కలిసి ఈమె చేసినా ఒక ఎపిసోడ్ అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాదులో నాగ చైతన్యకు ఒక ప్రత్యేకమైన వంటకాలను అందించే హోటల్ ఉంది. ఆ హోటల్లో నాగచైతన్య తో కలిసి ఆశ్రిత సందడి చేసింది. హైదరాబాదులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ హోటల్స్ చాలా వరకు తమ హోటల్ లో అశ్రిత ఒక వీడియో చేయాలని కోరుకుంటారట. ఆమెకు ఉన్న ఫాలోవర్స్ రెండు లక్షల అయినా కూడా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు ఈమె యొక్క వీడియోలను ఫాలో అవుతూ.. ఆమె ఇచ్చే రివ్యూ ఆధారంగా ఆయా హోటల్స్ ని ఎంపిక చేసుకుంటారట. అందుకే ఆమెకు యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం కంటే బ్రాండింగ్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ అన్నట్లుగా సమాచారం అందుతుంది. hero Venkatesh Daughter Aashritha youtube income అశ్రిత నెల నెల భారీ మొత్తంలోనే ఆదాయాన్ని యూట్యూబ్ ద్వారా సొంతం చేసుకుంటుందట. ఆమె లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వీడియోల రూపంలో షేర్‌ చేస్తూ డబ్బులు సంపాదించడం నిజంగా అభినందనీయం అంటున్నారు. ఎంతో మంది అమ్మాయిలు ఈమెని చూసి నేర్చుకోవచ్చని.. భర్త తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఇలా సొంతంగా కష్టపడుతూ తమను తాము తెలుసుకుంటూ ముందుకు సాగడం అశ్రిత నుండి నేర్చుకోవాలి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి యూట్యూబ్‌ వీడియోలకు మంచి పాపులారిటీ ఉంటుంది కనుక ఆమెకు భారీగానే డబ్బులు వస్తూ ఉంటాయి.. కనుక ముందు ముందు కూడా ఆమెకు మరిన్ని విజయాలు సాధ్యం అవ్వాలని కోరుకుందాం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !