UPDATES  

 ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త

ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త. బదిలీలకు వైసీపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. సోమవారం నుంచి ప్రక్రియ ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది. గత కొద్దిరోజులుగా ఉపాధ్యాయ వర్గాలు బదిలీల కోసం ఎదురుచూస్తున్నాయి. పాఠశాలల విలీనం, యాప్ ల వినియోగం వంటి వాటితో చాలామంది అయిష్టతగానే కొన్ని పాఠశాలల్లో కొనసాగుతూ వస్తున్నారు. అటువంటి వారంతా బదిలీల కోసం ఎదురుచూస్తు వస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి నిరాశపడ్డారు. అటు ప్రభుత్వ చర్యలతో ఆగ్రహంగా ఉన్న ఉపాధ్యాయులను చల్లార్చేందుకు ప్రభుత్వం బదిలీలకు పచ్చజెండా ఊపింది. అయితే పాఠశాల విద్యాశాఖ నిర్వహణ విషయంలో ప్రభుత్వ అస్పష్ట విధానాలు గందరగోళానికి కారణమవుతున్నాయి. సాధారణంగా వేసవిలో, విద్యాసంవత్సరం ప్రారంభంలో బదిలీ ప్రక్రియ చేపట్టాలి.

కానీ విద్యాసంవత్సరం మధ్యలో చేపడుతుండడంతో ఆ ప్రభావం విద్యాబోధనపై పడే అవకాశముంది. Transfer Of Teachers In AP ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు తొలుత సర్దుబాటు చేశారు. అవసరమైన పాఠశాలలకు ఇతర స్కూళ్ల నుంచి ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై పంపాలని ఈ నెల మొదటి వారంలో ఆదేశాలిచ్చారు. పదో తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో కచ్చితంగా ప్రతి సబ్జెక్టుకూ టీచర్‌ ఉండాలని చెబుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. 3, 4, 5 తరగతులను విలీనం చేసిన పాఠశాలల్లో ఆ తరగతులకు స్కూల్‌ అసిస్టెంట్లతో బోధన చేపట్టాలని కూడా భావించారు. ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్‌ పాఠశాలలకు ఎస్జీటీలను అందుబాటులో ఉంచాలని ఆదేశాలిచ్చారు. దీంతో ఇటీవల ఎస్జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన టీచర్లంతా ఉన్నత పాఠశాలలకు వెళ్లిపోవాలని కూడా సూచించారు. . సాధారణంగా పదోన్నతి ఇచ్చిన వెంటనే అందుకు తగ్గ పాఠశాలలో పోస్టింగ్‌ ఇవ్వాలి. కానీ ఇటీవల ప్రమోషన్స్ పొందిన వారంతా… అవే స్థానాల్లో కొనసాగిస్తూ వచ్చారు.

వారిని సర్దుబాటు చేస్తామని సంకేతాలిచ్చిన ప్రభుత్వం తాజాగా మనసు మార్చుకుంది. బదిలీలకు మొగ్గుచూపింది. గత అనుభవాల దృష్యా పారదర్శకంగా బదిలీ చేప్టనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. పూర్తిగా వెబ్ తరహాలోనే ప్రక్రియ చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న హెచ్ఎంలు, 8 సంవత్సరాలు ఒకోచోట పనిచేసిన ఉపాధ్యాయులకు బదిలీ తప్పనిసరి చేసింది. జీవో సర్వీసు ఉన్నా దరఖాస్తు చేసుకునే వెసులబాటు కల్పించింది. స్పౌజ్,దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పాఠశాలల స్టేషన్ పాయింట్లను సైతం పరిగణలోకి తీసుకోనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్తలు వచ్చిననేపథ్యంలో ..ఇప్పుడు బదిలీలకు పచ్చజెండా ఊపడంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !