UPDATES  

 సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ సెటైర్లు

సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ సెటైర్లు వేయడమే కాదు, తన మార్షల్ ఆర్ట్స్ ప్రావీణ్యాన్ని కూడా పరిచయం చేస్తున్నారు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్. తాజాగా జనసేనాని పోస్ట్ చేసిన మార్షల్ ఆర్ట్స్ పిక్ ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అభిమానులు ఈ స్టిల్‌ని ఎంజాయ్ చేస్తున్నా, చాలామంది ట్రోల్ చేస్తున్నారు. తన తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ కోసం మార్షల్ ఆర్ట్స్ తిరిగి ప్రాక్టీస్ చేయాల్సి వస్తోంది పవన్ కళ్యాణ్‌ కి. దానికి సంబంధించిన ఫొటోనే జనసేనాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ కారు రంగు గోలేంటి.? జనసేనాని సోషల్ మీడియా వేదికగా ఆలివ్ కలర్ వున్న వాహనాల ఫొటోల్ని పోస్ట్ చేసి, ఏపీలోని అధికార వైసీపీని విమర్శించే ప్రయత్నం చేశారు.

అయితే, దురదృష్టవశాత్తూ ఆ ఫొటోల్లో ఒకటి విదేశాలకు చెందిన కారు కావడం గమనార్హం. దాంతో, జనసేనాని అడ్డంగా బుక్కయిపోయారు. ఇండియాలో ఆలివ్ గ్రీన్ మీద ఆంక్షలున్నాయ్.. విదేశాల్లో కాదంటూ జనసేనాని మీద సెటైర్లేస్తున్నారు నెటిజనం. పవన్ ఎన్నికల వాహనం ‘వారాహి’కి ఆలివ్ గ్రీన్ కలర్ వేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. Olive Green Color Of Pawan Kalyan Election Vehicle Varahi Controversial అయితే, ఆ వాహనం రిజిస్ట్రేషన్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే దాని అసలు రంగు, ఇతరత్రా వ్యవహారాలు బయటపడతాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !