UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 వైసీపీ ప్రభుత్వం నోరెత్తకుండా సమైక్య రాష్ట్రం ప్రకటనలు

ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వైసీపీ ప్రభుత్వం నోరెత్తకుండా సమైక్య రాష్ట్రం ప్రకటనలు చేయడం మోసపూరితమైన ప్రయత్నమని చంద్రబాబు అన్నారు. ఈమేరకు ట్వీట్ చేశారు. ‘ఏపీలో అన్నదాతల ఆత్మహత్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. టీడీపీ హయాంలో వ్యవసాయం వృద్ధి, ఆక్వా ఎగుమతుల్లో రికార్డులు సృష్టిస్తే.. వైసీపీ ప్రభుత్వ హయాంలో 1673 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు వ్యతిరేక విధానాలు, మద్ధతు ధర లేకపోవడం, వ్యవసాయ సబ్సీడీలు నిలిచిపోవడమే కారణం.

టెర్రరిజం తరహాలో ప్రజలపై వేధింపులు, కక్ష సాధింపులకు పాల్పడటంతో సామాన్యులు సైతం ప్రాణాలు తీసుకుంటున్నారు’. ‘ఇన్ని సమస్యలతో ప్రజలు ఉంటే తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా ప్రకటనలు చేస్తోంది. రెండు రాష్ట్రాలను కలపాలంటూ గందరగోళంలోకి నెడుతోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ సమైక్య రాష్ట్రం అంటూ ప్రజలను మభ్యపెడుతోంది. రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది’ అని అన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !