సినీ పరిశ్రమలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ లు విడాకులు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. సినిమా స్టార్స్ కూడా వారి యొక్క వివాహ జీవితాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటారు. ఏది ఏమైనా సరే సినిమా స్టార్స్ వైవాహిక జీవితాలు చాలా సున్నితంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు పంతాలు పట్టింపులంటుపోయి విడాకులు దాకా వెళ్తుంటారు. సమంత మరి నాగచైతన్య దీనికి ఉదాహరణ చెప్పవచ్చు. వీరు విడాకులు తీసుకున్న నాలుగు నెలల ముందు కూడా గోవాలో బాగా ఎంజాయ్ చేశారు. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని చాటుకున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరిద్దరి హంగామా బాగా కనిపించేది. అంతలా కలిసి ఉన్న జంట 4 నెలల తర్వాత వెంటనే విడాకులు తీసుకునే అందర్నీ ఆశ్చర్యానికి లోన్ చేశారు.
అయితే విడాకులు సమయంలో మాత్రం చాలామంది వారి భార్యలకు భారీగా భరణం సమర్పిస్తున్నారు. అయితే అలా భరణం తీసుకుని విడిపోయిన ప్రేమ జంటలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సైఫ్ అలీఖాన్ – అమృత సింగ్… వీరిద్దరి పెళ్లి పెద్ద సంచలనం అని చెప్పాలి. వయసులో తనకన్నా 12 ఏళ్లు పెద్ద అయినా అమృతను సైప్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంట చాలా ఏళ్ళు వైవాహిక జీవితంలో గడిపారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది ఆమె పేరు సోహ అలికాన్.ఈమె ఇప్పుడు బాలీవుడ్లో యంగ్ క్రేజీ హీరోయిన్. అయితే కరీనా కపూర్ను పెళ్లి చేసుకునేందుకు సైఫ్ అలీఖాన్ అమృతకు విడాకులు ఇచ్చాడు. ఇక విడాకులు సమయంలో ఆమెకు భరణంగా అతడు సంపాదించిన దాంట్లో సగం మొత్తంను ఆమెకు ఇచ్చేశాడు. Top heroines who became millionaires after divorce హృతిక్ రోషన్ – సొనానే ఖాన్…. హృతిక్ రోషన్ చిన్ననాటి స్నేహితురాలు అయినా సుసానే ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక 2014లో విడాకులు తీసుకున్నారు.
ఇక సుమారుగా ఆమె సుమారుగా 400 కోట్ల భరణం అడగగా అందులో సగం ఇచ్చేందుకు హృతిక్ రోషన్ ఒప్పుకున్నాడని సమాచారం. మలైకా అరోరా – అర్బాజ్ ఖాన్….. 15 ఏళ్ల పాటు వివాహ జీవితంలో గడిపిన ఈ జంట ఓ బిడ్డను కన్నాక విడాకులు తీసుకుంది. వీరి విడాకులకు గల కారణం మలైకా అర్జున్ కపూర్ ప్రేమలో ఉండడమని వార్తలు ఉన్నాయి. అయితే మలైకా భరణం కోరకపోయినప్పటికీ అర్బాజ్ ఆమెకు 20 కోట్లు ,భరణంగా ఇచ్చాడు. సంజయ్ కపూర్ – కరిష్మా కపూర్… అభిషేక్ బచ్చన్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి వరకు రాకుండానే విడిపోయింది కరిష్మా కపూర్. ఆ తర్వాత అమెరికా ఎన్నారై అయినా సంజయ్ కపూర్ను పెళ్లి చేసుకుని 14 ఏళ్ళు కాపురం చేసి, ఇద్దరు బిడ్డలకు తల్లి అయినాక విడాకులు తీసుకుంది. ఇక భరణంగా కరిష్మా కపూర్ ముంబైలో ఖరీదైన ఇంటితోపాటు నెలనెల 10 లక్షల వడ్డీ వచ్చే ఆస్తులు తన పిల్లల పేరిట 14 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకుంది. సమంత – నాగచైతన్య…. ఇటీవల రీసెంట్గా టాలీవుడ్ లో విడిపోయిన జంట చైతన్య సమంత. విడాకులు తర్వాత అక్కినేని ఫ్యామిలీ సమంతకు రెండు వందల కోట్లు భరణంగా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే సమంత వీటిని ఖండిస్తూ మాట్లాడింది.