ఇటీవల వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సమైక్యాంధ్ర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు వైకాపా ది సమైక్యాంధ్ర నినాదం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కుదిరితే ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలను ఏకం చేయాలి అనేది మా కోరిక అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సమైక్య రాష్ట్రంపై ప్రకటనలా అంటూ మండిపడ్డాడు. సమైక్య రాష్ట్రం పేరు చెప్పి ప్రజలను మళ్లీ మభ్య పెట్టడం మోసపూరితమవుతుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.
రాష్ట్రంలో రైతుల పెరగడం ఆందోళనకరంగా ఉందని టిడిపి హహంలో వ్యవసాయ రంగంలో రికార్డు సాధించామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వైసీపీ రైతు వ్యతిరేక విధానాల వల్ల అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన తప్పులను ప్రభుత్వ పెద్దలను సరిదిద్దుకోవాలని చంద్రబాబు నాయుడు అన్నాడు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా వ్యవహరించాలి కాని సమైక్య నినాదం ఎత్తుకొని ప్రజలను మభ్య పెట్టవద్దని బాబు ఎద్దేమో చేశాడు.