UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 పశువుల దాణా కేసు నుంచి స్పెక్ట్రమ్ దాకా సిబిఐ అనేక సంచలనాలకు వేదిక

ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే, కేంద్రం పంజరంలో చిలుక అన్నా సరే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇందులో రాజకీయ ప్రేరేపిత కేసులు ఉండవచ్చు. ఇబ్బందులు ఉండవచ్చు.. జై ళ్ళకు పంపించడాలు కూడా ఉండవచ్చు. కానీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం ఒక కేసు నమోదు చేసింది అంటే దాని వెనుక ఎన్నో బలమైన కారణాలు ఉంటాయి, మరెన్నో అవకతవకలు నమోదయి ఉంటాయి. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు సంస్థను బద్నాం చేయడానికి లేదు. కొన్ని రాజకీయ ప్రేరేపితాలు ఉన్నంత మాత్రాన అన్ని ఆ కోవలోకే ఉంటాయనుకోవద్దు.. ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసును విచారిస్తున్న సిబిఐ… వేగంగా అడుగులు వేస్తోంది. కాకపోతే ఇప్పుడు సిబిఐ చేస్తున్న దర్యాప్తు 2 జీ స్పెక్ట్రమ్ కేసును పోలి ఉన్నది. చాలామంది మెదళ్ళల్లో కవిత మరో కనిమొళి కాబోతోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దాణా నుంచి 2జి దాకా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పై ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి కానీ… ఒకటి రెండు లోపాలు ఉండవచ్చు గాని అది ఎన్నో కేసుల్లో నిందితులను కోర్టు దాకా ఈడ్చింది. ప్రభుత్వ సొమ్మును బొక్కిన పందికొక్కులను జైల్లో వేసింది.

పశువుల దాణా కేసు నుంచి స్పెక్ట్రమ్ దాకా సిబిఐ అనేక సంచలనాలకు వేదిక అయింది. అయితే ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ మెరుపు వేగంతో విచారణ చేస్తోంది. దీని వెనుక మోడీ ఉన్నాడు అని చాలామంది అనుకోని ఉండవచ్చు గాక.. కానీ ఒక పరిధి మేరకు మాత్రమే అధికారం అనేది పనిచేస్తుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టాల్సింది అధికారులే. ఎందుకంటే వివరాలు సమగ్రంగా సమర్పించకపోతే కోర్టు నుంచి మొట్టికాయలు తినాల్సి వస్తుంది. సేమ్ అలాగే యూపీఏ ప్రభుత్వం హయాంలో 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం ఎంతటి సంచలనానికి దారితీసిందో చెప్పాల్సిన పనిలేదు. లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పైగా అప్పటి టెలి కమ్యూనికేషన్ శాఖ మంత్రి రాజా… ఎంపీ దయానిది మారన్ కు చెందిన టెలికాం కంపెనీలకు చవక ధరకు స్పెక్ట్రమ్ కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. ఇందులో కరుణానిధి కుమార్తె కనిమొళి కీలక పాత్ర పోషించారని అప్పట్లో వార్తలు గుప్పు మన్నాయి.. అయితే ఈ క్రమంలో ఈ కేసు కు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ బృందం క్షేత్రస్థాయిలో నాలుగు సార్లు కని మొళి ని విచారించింది. ఆ తర్వాత అరెస్టు చేసింది. ప్రస్తుతం ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో కూడా సిబిఐ ఇలాగే వ్యవహరిస్తోంది. సౌత్ గ్రూప్ నుంచి వెళ్లిన 100 కోట్ల ముడుపులు, 10 ఆపిల్ ఐఫోన్ల ధ్వంసం, అలాంటి విషయాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం కూపి లాగుతున్నది. చాలా తెలివిగా ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తులను జస్ట్ అనుమానుతులుగానే పరిగణిస్తున్నది.. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కనుకునేందుకు వారికి కేవలం నోటీసులు మాత్రమే ఇస్తున్నది. ఆ తర్వాత అసలు గేమ్ ప్రారంభించే యోచనలో ఉంది. కీలక వివరాలు వారి వద్ద నుంచి రాబట్టిన తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఎమ్మెల్సీ కవితను సుమారు ఐదు గంటలకు పైచిలుకు సిబిఐ అధికారులు విచారించారు. ఆమె ద్వారా కీలక ఆధారాలు రాబట్టారు.. మరి కొన్నిసార్లు కూడా ఇదే తీరున విచారించి తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !