UPDATES  

 యశోద మూవీ ఫైనల్ కలెక్షన్స్

యశోద సినిమా సమంత కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. సోలో హీరోయిన్‌గా పాన్ ఇండియన్ లెవల్‌లో పెద్ద విజయాన్ని అందుకున్నది.

సరోగసీ బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన యశోద సినిమాకు హరీ, హరీష్ దర్శకత్వం వహించారు.

వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్ రన్ ద్వారా యశోద సినిమా 33 కోట్ల గ్రాస్‌ను 15 కోట్ల షేర్‌ను సొంతం చేసుకున్నది. అత్యధికంగా నైజాంలో ఈ సినిమా ఐదు కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. ఓవర్‌సీస్‌లో 2.85 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. సీడెడ్‌లో కోటి, ఉత్తరాంధ్రలో కోటి యాభై లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా సమంత ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనకపోయినా కంటెంట్ బాగుండటంతో తెలుగు ప్రేక్షకులు యశోద సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

తమిళంలో ఈ సినిమాకు కోటి నలభై లక్షల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్ల వరకు జరిగినట్లు తెలిసింది. నిర్మాతలకు దాదాపు నాలుగు కోట్లకుపైగా లాభాలను తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అదృశ్యమైన తన సోదరిని వెతుక్కుంటూ యశోద అనే యువతి సాగించిన అన్వేషణ నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సరోగసీ సెంటర్ పేరుతో బేబీ ఫీటస్‌లను ఉపయోగిస్తూ భారీ క్రైమ్‌కు పాల్పడుతోన్న పలుకుబడి కలిగిన కొందరు వ్యక్తులను యశోద చట్టానికి ఏ విధంగా పట్టించిందన్నదనే ఈ సినిమా కథ.

వరలక్ష్మి శరత్‌కుమార్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించింది. ఉన్నిముకుందన్‌, రావురమేష్‌, సంపత్ కీలక పాత్రలు పోషించారు. యశోద సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సీక్వెల్‌కు సంబంధించి కథను సిద్ధం చేసినట్లు దర్శకద్వయం హరీ, హరీష్ సక్సెస్ మీట్‌లో పేర్కొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !