UPDATES  

 తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇనాయా ఎలిమినేషన్ కాంట్రవర్సీ

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇనాయా ఎలిమినేషన్ కాంట్రవర్సీగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇండస్ట్రీ కష్టాల గురుంచి ఓ ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ ఇంటర్వ్యూలో ఇనాయా ఏమంది అంటే…”రంగుల ప్రపంచంలో అవకాశాలు కోసం ఎన్నో ఆశలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. ఎప్పుడూ కూడా నా ధ్యాస మొత్తం సినిమా సెట్ ..షూటింగ్ లో పాల్గొనాలి. ఈ క్రమంలో అవకాశం వచ్చిన ప్రతిసారి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరితో మాట్లాడేదాన్ని. అలా మాట్లాడటంతో సెట్ లో వర్కర్స్ సైతం చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరితో కలిసి పోవడం నాకు అలవాటు. సినిమా ఇండస్ట్రీ అంటే ఫస్ట్ అలా ఉంటుంది అలా ఉంటుంది అని భయపెట్టారు.

కానీ నటన మీద ప్రేమతో అన్నింటికి తెగించి వచ్చాను.ఒకప్పుడు నన్ను వెనక్కి లాగాలి అని ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతూ మెసేజ్ లు పెడుతున్నారు. ఆఫర్ ల విషయంలో కరాకాండగా ఉండేదాన్ని. ఎస్ అంటే ఎస్, నో అంటే నో ఆ రీతిలో మొహం మీద చెప్పేసేదాన్ని. ఇంకోటి చేయాలంటే మాత్రం కచ్చితంగా నో చెప్పేదాన్ని. ఈ ప్రయత్నాలలో భాగంగా ఒకటి రెండు మూడు ఆఫీసులలో కమిట్మెంట్ కూడా అడిగారు. నేను నో చెప్పి వెళ్ళిపోయా. అవకాశాల కోసం నేను ఆ రీతిగా వ్యవహరించేదాన్ని… ముఖం మీద చెప్పేదాన్ని. అయితే వాళ్ల పేర్లు చెప్పాలని అనుకోవడం లేదు.

ఒక్కసారి ఇండస్ట్రీలో కొద్దిగా పేరు ఉన్న హీరో మూవీకి ఆడిషన్స్ కి వెళ్ళాను.సెలెక్ట్ కూడా అయ్యాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత తొందరగా సెలెక్ట్ చేశారంటే ఏదో ఉంది అని కొద్దిగా డౌటు.. పడుతుండగా వాళ్ళు కమిట్మెంట్.. ప్రస్తావని తీసుకొచ్చేసరికి నేను పక్కకెళ్ళిపోయాను. ఈ రీతిగా నాకు రెండు మూడు సినిమాలకు అనుభవం ఎదురయ్యింది. మరి కొంతమంది నా పర్సనాలిటీ గురించి మాట్లాడే వాళ్లు. హీరోల దాకా ప్రొఫైల్ వెళ్లకుండా అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్స్ దగ్గర వరకు మన ప్రొఫైల్ వెళ్లాలంటే మధ్యలో పెద్ద స్టోరీ నడుస్తుంది అంటూ ఇండస్ట్రీలో రాసిక రాజల బాగోతల గురించి ఇనాయా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ఇప్పుడు బయట వైరల్ గా మారింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !