UPDATES  

 సమంత మేనేజర్ కి నాగ చైతన్య ఫోన్ చేశాడని, సమంత ఆరోగ్యం విషయమై తెలుసుకునే ప్రయత్నం చేశాడని సమాచారం

సమంత మయో సైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవలే కొరియాకు చికిత్స నిమిత్తం వెళ్ళింది. దాదాపు వారం రోజులు అవుతున్న కూడా ఇప్పటికీ అక్కడే ఉందనే సమాచారం అందుతుంది. మరో వారం రోజుల తర్వాత కానీ కొరియా నుండి సమంత తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆమె నటించిన యశోద సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే గుణ శేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత హాజరయ్యే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలోనే సమంత మేనేజర్ కి నాగ చైతన్య ఫోన్ చేశాడని, సమంత ఆరోగ్యం విషయమై తెలుసుకునే ప్రయత్నం చేశాడని సమాచారం అందుతుంది. గతంలో సమంత మేనేజర్ తో నాగ చైతన్యకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సన్నిహిత సంబంధాలతోనే నాగ చైతన్య స్వయంగా సమంత మేనేజర్ కి ఫోన్ చేసి మరి ఆమెను ఆరోగ్యం గురించి మాట్లాడాడట. ఇంకా ఎన్నాళ్లు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని..

ఆమె ఎప్పటి వరకు సినిమాలుకు దూరంగా ఉంటుందనే విషయాలను కూడా మేనేజర్ ను నాగచైతన్య అడిగి తెలుసుకున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అయితే అక్కినేని ఫ్యామిలీ వారు మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. నాగచైతన్య మరియు సమంత సన్నిహితులుగా విడి పోయారు. అయితే ఇద్దరి మధ్య ప్రస్తుతానికి స్నేహం కానీ ఇంకా వేరే ఇతర రిలేషన్ కానీ లేదు. కనుక సమంత ఆరోగ్యం గురించి నాగ చైతన్య ఫోన్ చేసి ఉండడు అని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి నాగచైతన్య ఫోన్ చేశాడా లేదా అనేది ఆయనకే తెలియాలి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !