UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ఇండియా స్థాయి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్పతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను తనవైపునకు తిప్పుకున్న బన్నీ.. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంతో బిజీగా ఉన్నారు. సుకుమార్ మరోసారి పుష్ప మ్యాజిక్‌ను రిపీట్ చేసేలా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పుష్ప టీమ్ రష్యాకు వెళ్లింది. అక్కడ ఆ సినిమాను విడుదల చేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప-2పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సీక్వెల్‌లోనూ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప-2 డైలాగ్స్ లీకయ్యాయంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొన్ని డైలాగులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

“అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేసాయి అంటే?.. పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్ వచ్చాడని అర్థం.”అనే డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది కాకుండా మరో డైలాగ్ కూడా చక్కర్లు కొడుతోంది. “వాళ్లు గొర్రెల్ని కాయడానికి వచ్చారు. ఆ గొర్రెల్ని తినడానికి పులి వస్తే వేసేయడానికి నేను వచ్చాను” అనే సంభాషణ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్‌పై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఇవి నిజంగా పుష్ప-2లో ఉన్నాయో లేదో తెలియదు కానీ.. డైలాగులు మాత్రం అదిరిపోయాయని పోస్టులు పెడుతున్నారు.

ఈ డైలాగులు సినిమాలో నిజంగా ఉంటే బాగుంటుందని మరొకరు తన స్పందనను తెలియజేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప-2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రష్యాలో రీ రిలీజ్ చేయనుండటంతో కాస్త గ్యాప్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేనీ, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. అల్లు అర్జున్, రష్మికా మందన్నా, ఫహాద్ ఫాజిల్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !