UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 తెలంగాణలో మహిళా సీఎం.?

రాజకీయ పార్టీల్లో పెరుగుతున్న ప్రాధాన్యత వల్ల తెలంగాణ రాజకీయాల్లో మహిళా నేతల పేర్లు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుకొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వరకు మహిళా నేతలు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. 2023లో మహిళా నేతలు చక్రం తిప్పుతారా ? అధికార పగ్గాలు మహిళామణులకు అప్పగిస్తారా ? అంటే గుర్రం ఎగరను వచ్చు.. రాజకీయాల్లో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ రాజకీయ చిత్రపటంలో మహిళకు పట్టాభిషేకం చేసి సరికొత్త రికార్డు సృష్టిస్తారా ? లేదా ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీలో మాజీ ఎంపీ, తాజా ఎమ్మెల్సీ కవిత న్యూస్ ఇప్పుడు హాట్ హాట్ గా పబ్లిసిటీ అవుతుంది. లిక్కర్ స్కీంలో సీబీఐ దర్యాప్తు సాగుతోంది. నోటీసుల జారీ, విచారణ ప్రక్రియ కొనసాగుతోంది.

బీఆర్ఎస్ తాజా ఎత్తుగడలో భాగంగా మహిళా సెంటుమెంటు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వేధింపులు, కక్ష సాధింపులు అంటూ.. కవితను ముందు పెట్టి బీఆర్ఎస్ రాజకీయం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కు తనయ కవిత అంటే మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో కవితను ముందు పెట్టి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడుగా వెళ్లే అవకాశాలున్నాయి. కవిత మంచి వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం, వ్యవహరాలు అన్ని లక్షణాలు ఉండటం.. తండ్రికి తగ్గ తనయురాలిగా పేరు సాధించడం ఆమెకు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. లిక్కర్ కేసుతో కవితకు కావాల్సిన దానికంటే పబ్లిసిటీ కూడా వచ్చింది.

సీఎం పదవికి వారసురాలిగా ఎమ్మెల్సీ కవితకు అవకాశం ఇవ్వాలని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు. ఇక బీజేపీ అధికారంలోకి వస్తే.. మహిళ అభ్యర్థి సీఎం అయ్యే అవకాశాలు లేకపోలేదు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రస్తుతానికి యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్ గా పేరొందిన విపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దిట్టగా గద్వాల జేజేమ్మ ప్రశస్తికెక్కారు. బీజేపీ జాతీయ నాయకత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. తెలంగాణ వసుంధర రాజేగా డీకే అరుణ వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం అధిరోహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె అనుచరులు చెబుతున్నారు.

   TOP NEWS  

Share :

Don't Miss this News !