UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 రుచికి సంబంధించినంత వరకు పుట్టగొడుగులు మాంసానికి సరైన ప్రత్యామ్నాయం

రుచికి సంబంధించినంత వరకు పుట్టగొడుగులు మాంసానికి సరైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. చాలామంది కాల్చిన, వేయించిన పుట్టగొడుగులను ఎక్కువగా ఇష్టపడతారు. మరికొందరు పుట్టగొడుగుల కూరను కూడా ఇష్టపడతారు. అయితే పుట్టగొడుగులు పోషకమైనవి అని ఎక్కువమందికి తెలియదు. కానీ పుట్టగొడుగులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు ఆహార నిపుణులు. ఏ ఆరోగ్యకరమైన ఆహారంలోనైనా దీనిని తప్పకుండా చేర్చుకోవచ్చు. అయితే ముఖ్యంగా మధుమేహాన్ని అదుపు చేయడంలో పుట్టగొడుగులు మేలు చేస్తాయి.

వాటిలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను పెంచడంలో సహాయపడతాయి. పుట్టగొడుగులలో చక్కెర పదార్థం ఉండదు. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా సహాయపడతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా దీనిని తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. రోగనిరోధక శక్తికోసం.. అంతేకాకుండా పుట్టగొడుగులు సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వాటిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీబయాటిక్ లక్షణాలు.. ఇమ్యూనిటీని పెంచడంలో సహాయం చేస్తాయి. అవి కణజాలాన్ని సరిచేయడానికి సహాయపడతాయి. బరువు తగ్గాలనుకుంటే.. పుట్టగొడుగులలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది.

అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా సహాయం చేస్తుంది. జీర్ణ సమస్యలు దూరం చేసుకోవడానికై.. పుట్టగొడుగులలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. వాటిలో ఫోలిక్ యాసిడ్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు మూలకాలు హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడతాయి. హెల్తీ స్కిన్ కోసం.. మీరు ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందాలనుకుంటే.. కూడా మీరు పుట్టగొడుగులను తినవచ్చు. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ గుణాలు.. చర్మ సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !