UPDATES  

 సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న జంటగా నటించిన మిషన్ మజ్ను …ఓటీటీలో రిలీజ్

సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న జంటగా నటించిన మిషన్ మజ్ను సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నది. మంగళవారం ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు.

జనవరి 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శంతను బాగ్చి దర్శకత్వం వహించాడు.

ఇండియా నిర్వహించిన గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్‌ నుంచి స్ఫూర్తి పొందుతూ ఈ సినిమాను రూపొందించారు. బాలీవుడ్‌లో రష్మిక మందన్న అంగీకరించిన తొలి సినిమా ఇది. ఈ సినిమాతోనే ఆమె హిందీలో అరంగేట్రం చేయాల్సింది.

కరోనాతో పాటు ఇతర కారణాల వల్ల మిషన్ మజ్ను రిలీజ్ ఆలస్యమవడంతో రష్మిక మందన్న నటించిన గుడ్‌బై తొలుత ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ సినిమాను థియేటర్స్ కోసమే తెరకెక్కించారు. మే నెలలో థియేటర్లలో విడుదలచేయాలని భావించారు. కరోనా ప్రభావం కారణంగా థియేటర్లలో పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. చివరకు డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా మిషన్ మజ్ను సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

దాదాపు 30 కోట్లకు మిషన్ మజ్ను ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో సీక్రెట్ మిషన్ కోసం పాకిస్థాన్ వెళ్లే రా ఏజెంట్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. రష్మిక మందన్న కూడా సీక్రెట్ ఏజెంట్‌గా నటిస్తున్నట్లు చెబుతున్నారు.

 

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !