UPDATES  

NEWS

టెట్ ఫీజును వెంటనే తగ్గించాలి..200 నుండి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం.. మాతృ అభయ పౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్, పరీక్ష సామాగ్రి, ఆట వస్తువులు పంపిణీ… కరకగూడెంలో అగ్రిటెక్ శాఖ ప్రారంభం…అధునాతన పరికరాలతో రైతులు సాగు చేయాలి.. ఈసం వారి ఇలవేల్పు దూలుగొండ తల్లి జాతర ప్రారంభం.. ఘనంగా ప్రారంభమైన లక్ష్మీదేవి జాతర.. మద్యం తాగి వచ్చాడు…. సస్పెండ్ అయ్యాడు.. ఫోన్ పోయింది…. పోలీస్లు పట్టారు..బాధితునికి అందజేసిన సీఐ రాజువర్మ.. మానవత్వం చాటిన మాలమహానాడు…నిరుపేద రోగికి వితరణ చాటడం అభినందనీయం… – డిప్యూటీ తహసీల్దార్, బీరవెల్లి భరణి బాబు. రామకృష్ణ స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీ నాగులమ్మ కు ప్రత్యేక అభిషేకాలు… వేలం పాట ముగిసింది…

 చనా దాల్ పులావ్….చాలా టేస్టీ

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం.బరువు తగ్గాలి అనుకునేవారు.. తమ డైట్​లో దీనిని తీసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక బరువు తగ్గడానికి ప్రోటీన్-రిచ్ డైట్ చాలా ముఖ్యమని చెప్తున్నారు. చనా దాల్ పులావ్​ ప్రోటీన్​ను ఎక్కువగా కలిగి ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. అంతేకాకుండా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు * బియ్యం – 300 గ్రాములు * పచ్చి శనగపప్పు – 1 కప్పు * పెద్ద ఉల్లిపాయ – 1 (కట్ చేసుకోవాలి) * టొమాటో – 2 (ప్యూరీ చేసుకోవాలి) * పచ్చిమిర్చి – 2 (కట్ చేసుకోవాలి) * అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్ * కారం – 2 స్పూన్లు * జీలకర్ర – 1 టీస్పూన్ * బే ఆకు – 1 * యాలకులు – 2 * మిరియాల పొడి – కొంచెం * లవంగాలు – 2 * ఉప్పు – సరిపడినంత * ధనియాపొడి – 1 టీ స్పూన్ * పసుపు – చిటికెడు తయారీ విధానం ఈ రెసిపీని తయారు చేసుకోవాలి అనుకున్నరోజు.. వంట ప్రారంభించడానికి ముందుగా శనగ పప్పును 2 గంటలు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల పప్పు మెత్తగా, తేలికగా ఉడకుతుంది. పప్పు నానిన తర్వాత..

ప్రెజర్ కుక్కర్‌ తీసుకుని స్టవ్​ వెలిగించి దానిపై ఉంచండి. దానిలో నూనె వేసి.. మొత్తం మసాలాలు వేయండి. ఉల్లిపాయలు వేసి.. అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. అనంతరం టొమాటో ప్యూరీ, ధనియాలపొడి, పసుపు వేసి బాగా వేయించాలి. దానిలో కారం కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిలో నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, బియ్యం వేసి బాగా కలపాలి. రెండు గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్‌పై మూత పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చిన తర్వాత.. గ్యాస్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంతే వేడి వేడి చనా దాల్ పులావ్ రెడీ. దీనిని చట్నీతో లేదా ఇతర కర్రీలతో, రైతాతో సర్వ్ చేసుకోవచ్చు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !