UPDATES  

NEWS

కొంటె దివి… ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్… పది గంటలు ఉత్కంఠ.. నేడు మళ్ళీ కవిత విచారణ.. తెలంగాణలోకి బిజెపి ప్రవేశిస్తే ప్రమాదమే.. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓ, ఎంపిడిఓ లకు వినతి పత్రం.. మండల కేంద్రానికి సెంట్రల్ లైటింగ్ కొరకురూ 5 కోట్లు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కలెక్టర్ అనుదీప్ .  హర్షం వ్యక్తం చేసిన ఎంపీటీసీ ఐలూరి కృష్ణారెడ్డి .. లైబ్రరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్.. శ్రీరామనవమి ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలి.. గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు .. రివ్యూ మీటింగ్ లతో ఒరిగేదేమీ లేదు  – ఎమ్మెల్యే పొదెం వీరయ్య

 తాజాగా వీర సింహా రెడ్డి రన్‌టైమ్‌ వెల్లడి

బాలయ్య బాబు సంక్రాంతికి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. అతని మూవీ వీర సింహా రెడ్డి జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్ల జోరును మేకర్స్‌ పెంచారు. ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ సుగుణ సుందరి సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ను మంగళవారం (డిసెంబర్‌ 13) అనౌన్స్‌ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌ సింగిల్‌ జై బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌కు ఓ రేంజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్‌ సింగిల్‌ సుగుణ సుందరి రిలీజ్‌కు టైమ్‌ దగ్గర పడింది. ఈ సెకండ్‌ సింగిల్‌ను గురువారం (డిసెంబర్‌ 15) ఉదయం 9.42 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్‌ చెప్పారు. ఈ అనౌన్స్‌మెంట్‌తోపాటు మేకర్స్‌ ఓ రొమాంటిక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఇందులో బాలయ్య హీరోయిన్‌ను టీజ్‌ చేస్తూ కనిపిస్తున్నాడు. అంతేకాదు అతడు చాలా యంగ్‌ అండ్‌ ఎనర్జటిక్‌గా కూడా ఉన్నాడు. ఈ మూవీలో బాలయ్య సరసన శృతి హాసన్‌ నటిస్తోంది. దునియా విజయ్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ముఖ్యమైన పాత్రలు పోషించారు.

తాజాగా వీర సింహా రెడ్డి రన్‌టైమ్‌ను కూడా వెల్లడించారు. ఈ సినిమా 2 గంటల 43 నిమిషాల నిడివితో కాస్త పెద్దగానే ఉండనుందని చెప్పాలి. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. ఓ గెటప్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించగా మరో క్యారెక్టర్ స్టైలిష్‌గా ఉంటుందని సమాచారం.

   TOP NEWS  

Share :

Don't Miss this News !