UPDATES  

NEWS

 varahi ‘ రిజిస్ట్రేషన్ కు అంత ఖర్చయ్యిందా?

ఏపీ పాలిటిక్స్ లో పవన్ ప్రచార రథం ‘వారాహి’ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. అయితే ఈ ఇష్యూకు ఒక ఫుల్ స్టాప్ పడినట్టు కనిపిస్తోంది. పవన్ తన అభిరుచికి తగ్గట్టు.. అన్ని వసతులతో ప్రచార రథాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం రంగు, ఇతర విషయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. రాజకీయంగా వివాదం రాజుకుంది. తాజాగా ఈ వాహనానికి అన్నిరకాల అనుమతులు లభించాయి. ఇందుకు సంబంధించి లాంఛనాలన్నింటినీ తెలంగాణ రవాణా శాఖ పూర్తిచేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం పూర్తయ్యింది. టెంపరరీ నంబరు సైతం ఇచ్చేసింది. వాహనం కలర్, ఎత్తు, సామర్థ్యం.. ఇలా అన్నింటిపై నడిచిన వివాదాలు ఉత్తివేనని తేల్చేసింది. పవన్ తన ప్రచార రథంతో యుద్ధానికి సిద్ధమని సోషల్ మీడియాలో ప్రకటించిందే తరువాయి ‘వారాహి’పై సన్నాయి నొక్కులు ప్రారంభమయ్యయి.

అలివ్ గ్రీన్ రంగు వేయడం ఏమిటని స్టార్ట్ చేశారు. అది లారీ చాసీని బస్సుగా మార్చేశారని చెప్పుకొచ్చారు. చివరకు టైర్లపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి మైనింగ్ వాహనాలకు వినియోగించేవి అని.. సాధారణ రహదారులపై తిరగడానికి పనికిరావంటూ చెప్పేశారు. పైగా వాహనం సామర్థ్యానికి మించి రూపొందించారని.. ఎత్తు కూడా పరిమితికి మించి ఉందని ప్రచారం చేశారు. Varahi Registration అయితే ఈ ఆరోపణలన్ని ఏపీ సమాజం నుంచి.. అందునా అధికార వైసీపీ బ్యాచ్ నుంచే ఎక్కువగా వినిపించాయి. కానీ ఇవేవీ తెలంగాణ ట్రాన్స్ పోర్టు అధికారులు చెవికెక్కించుకోలేదు. ఇతర వాహనాల మాదిరిగానే నిబంధనలకు లోబడి రూపొందించడంతో రోజువారి ప్రక్రియలో భాగంగా వారాహికి కూడా రిజిస్ట్రేషన్ చేశారు. టెంపరరీ నంబరు కూడా కేటాయించారు. ఏపీ నుంచి వస్తున్న ప్రచారంలో నిజం లేదని తేల్చేశారు. నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశామని వివరణ ఇచ్చారు.

వారాహికి రిజిస్ట్రేషన్ నెంబర్ టీఎస్ 13 ఈఎక్స్ 8384 నంబరు కేటాయించారని తెలుస్తోంది. వారాహి కలర్‌ ఆలివ్ గ్రీన్‌ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని నిర్థారించారు. నిబంధనల మేరకు ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు వివరణ ఇవ్వడంతో ఈ వివాదాన్ని తెరదించినట్టయ్యింది. తాజాగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ పాపారావు వారాహి వాహన వివాదంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పలు విషయాలను వెల్లడించారు. రూ.5000 ప్రభుత్వానికి రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని చెప్పారు. సాధారణంగా స్పెషల్ నెంబర్స్ అనేవి ఈజీగా ఎవరికి అలర్ట్ కావు అలాంటివి కావాలి అంటే ప్రభుత్వానికి 5000 కట్టి మనకు కావాల్సిన నెంబర్స్ తీసుకోవచ్చు.వారాహికి కూడా 5000 కట్టి 8384అనే రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నారని వెల్లడించారు. డిఫెన్స్ కు చెందిన వాహనాలకు మాత్రం అలివ్ గ్రీన్ రంగు ఉంటుంది. మరే ఇతర వాహనాలకు అలివ్ గ్రీన్ పెయింట్ వేయకూడదన్న నిబంధన ఉంది. అయితే పవన్ వారాహి వాహనంపై వేసిన కలర్ ఎమరాల్డ్ గ్రీన్ అని నిర్థారణ కావడంతో రంగు వివాదం ముగిసినట్టే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !