UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 బ్యూరోక్రసి వ్యవస్థకు శాపంగా ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలి

ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలి బ్యూరోక్రసి వ్యవస్థకు శాపంగా మారుతోంది. జగన్ సర్కారు అనాలోచిత నిర్ణయాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బాధ్యత వహించాల్సి వస్తోంది. మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. న్యాయస్థానాల ముందు దోషిగా నిలబడాల్సి వస్తోంది. ప్రభుత్వంలో, పాలనలో వారిదే కీలక పాత్ర కాబట్టి.. కచ్చితంగా వారిదే రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వానికి మంచేదో.. చెడేదో చెప్పాల్సిన గురుతర బాధ్యత వారిది. అయితే వారు వీలున్నంతవరకూ నిబంధనలకు లోబడే సలహా ఇస్తుంటారు. కానీ వాటిని అమలుచేయడానికి జగన్ ఇష్టపడరని అందరికీ తెలిసిందే. తనకు నచ్చింది.. తాను మెచ్చింది.. అందునా పొలిటికల్ మైలేజీ వస్తుందంటే ఎందాకైనా వెళ్లేందుకు ఆయన సాహసిస్తారు. దాని ఫలితమే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కోర్టు బోనులో నిలబడడం. గత ఏప్రిల్ లో ముగ్గురు ఐఏఎస్ అధికారులు తప్పులపై హైకోర్టు ఆగ్రహించింది. కోర్టు ధిక్కరణ కింద ఏకంగా సామాజిక సేవా శిక్ష విధించింది. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు వారంలో ఒకసారి సొంత ఖర్చుతో భోజనాలు వడ్డించాలని ఆదేశించింది.

ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల నిర్మాణం వద్దన్న కోర్టు ఆదేశాలను పాటించనందుకు ఆగ్రహిస్తూ సామాజిక శిక్షను విధించింది. ఇప్పుడు తాజాగా కోర్టు ధిక్కరణ కింద ముగ్గురు కీలక అధికారులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకు ఏకంగా నెల రోజుల పాటు జైలుశిక్ష, రూ.2 వేలు చొప్పున జరిమానా విధించింది. TTD E.O Dharma Reddy రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ సహాయకులను నియమించిన సంగతి తెలిసిందే. జిల్లా సెలక్షన్ బోర్డు ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరిగింది. అయితే తనకు అన్ని అర్హతలు ఉన్నా.. వ్యవసాయ శాఖ సహాయకుడిగా ఎంపికచేయలేదని కర్నూలుకు చెందిన మదన్ సుందర్ గౌడ్ అనే వ్యక్తి 2019లో కోర్టును ఆశ్రయించాడు. ఆ పోస్టుకు పిటీషన్ పేరు పరిగణలోకి తీసుకోవాలని.. రెండు వారాల్లో ఈ వ్యవహారంపై తగు ఉత్తర్వులు ఇవ్వాలని 2019 అక్టోబరు 22 న హైకోర్టు ఆదేశించింది. కానీ కోర్టు తీర్పు, ఆదేశాలు అమలు చేయకపోవడంతో పిటీషనర్ ధిక్కరణ కింద మరోసారి కోర్టులో పిటీషన్ వేశాడు. ఈ కేసును విచారించిన కోర్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ పూర్వ కమిషనర్ హెచ్ కిరణ్ కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ లను బాధ్యులు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాలను సైతం భేఖాతరు చేసినందుకు ముగ్గురికి నెల రోజుల పాటు జైలుశిక్షతో పాటు రూ.2 వేలు చొప్పున జరిమానా విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ తీర్పు చెప్పారు.

అయితే కోర్టుకు హాజరైన అరుణ్ కుమార్, వీరపాండియన్ అభ్యర్థన మేరకు తీర్పు అమలును ఆరు వారాలపాటు వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆయన అభ్యర్థనను మన్నించలేమని న్యాయమూర్తి తేల్చిచెప్పారు. న్యాయస్థానాలు ఎవరి కోసం వేచిచూడవని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో మాలకొండయ్య అత్యవసరంగా ధర్మాసనం ముందు అపీల్ చేసుకోవాల్సి వచ్చింది. . కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో పనిచేయాలని ప్రతి అధికారికి ఉంటుంది. అక్కడ పనిచేసేవారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే అక్కడ ఉద్యోగాలకు భలే డిమాండ్ కూడా ఉంటుంది. ఇలా ఏరికోరి వచ్చిన వారే ఈవో ధర్మారెడ్డి. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ధర్మారెడ్డిని వైసీపీ పాలకులు సిఫారసు చేసి మరీ తెచ్చుకున్నారన్న టాక్ ఎప్పటి నుంచో ఉంది. ఇటువంటి ప్రచార నేపథ్యంలో అతడికి హైకోర్టు షాకిచ్చింది. నెల రోజుల పాటు జైలుశిక్ష విధించింది. రూ.2 వేలు జరిమానా విధించింది. అది కట్టకుంటే మరో వారం రోజులపాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకే కోర్టు ఆగ్రహిస్తూ ఈ తీర్పునిచ్చింది. ఇప్పుడిది తిరుమలతో పాటు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరారు. ఇందుకుగాను పోరాటం చేశారు.

విసిగిపోయిన వారు చివరకు కోర్టును ఆశ్రయించారు.వారి వేదనను విన్న కోర్టు సర్వీసును క్రమబద్ధీకరించాని ఆదేశాలిచ్చింది. కానీ ఈవో ధర్మారెడ్డి పెడచెవిన పెట్టారు. ఆదేశాలను అమలుచేయకుంటా జాప్యం చేశారు. దీంతో మరోసారి బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు తీర్పును వెలవరించింది. కోర్టు ధిక్కరణ కింద ఈవో ధర్మారెడ్డిని బాధ్యుడినిచేస్తూ జైలుశిక్ష, జరిమానా విధించింది. TTD E.O Dharma Reddy అయితే ఈ నలుగురు అధికారుల విషయంలోనే కాదు. చాలా శాఖలకు సంబంధించి అధికారులపై ఇటువంటి తీర్పులే వస్తున్నాయి. హైకోర్టు వద్ద పరిశీలిస్తే ప్రతీరోజూ ఏదో జిల్లా కలెక్టర్, ఎస్పీ తారసపడుతుంటారు. తమకు అన్యాయం జరిగిందని బాధిత వర్గాలు కోర్టును ఆశ్రయించడం.. కోర్టు ఆదేశాలివ్వడం రివాజుగా మారింది. అయితే కోర్టు ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ధిక్కరణ కింద మరోసారి అధికారులు దోషులుగా నిలబడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మంది అధికారులకు శిక్ష పడింది కానీ.. వారు డివిజన్ బెంచ్‌కు…ముందున్న మరో న్యాయస్థానానికి వెళ్లి స్టే తెచ్చుకున్నారు. బహుశా ధర్మారెడ్డికూడా అదే చేయవచ్చు.అటు పూనం మాలకొండయ్య సైతం ఇదే స్థితిలో ఊరట పొందొచ్చు. అయితే బ్యూరోక్రసీ వ్యవస్థను కోర్టు మెట్లు ఎక్కించిన ఘనత జగన్ కే దక్కుతుంది. నాడు అవినీతి కేసుల్లో అలా.. ఇప్పుడు నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకొని కోర్టు ధిక్కరణ కేసులను ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మెడకు చుట్టుకునేలా చేస్తోంది ముమ్మాటికీ జగన్ అనడం ఎటువంటి అతిశయోక్తి కాదు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !