తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చాక, ఆ పార్టీ అధినేత కేసీయార్ తెలంగాణలో ‘బీఆర్ఎస్’ జెండా ఆవిష్కరించారు. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నారు. కేసీయార్ అంటేనే యజ్ఞ యాగాదులకు కేరాఫ్ అడ్రస్. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయంలో ప్రత్యేక యాగాలకు శ్రీకారం చుట్టారు. అయితే, ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న బీఆర్ఎస్ వ్యవహారాల్లో, కేసీయార్ తనయుడు కేటీయార్ హంగామా కనిపించడంలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్.. పదవి మారిందా.? కేసీయార్ తనయుడు కేటీయార్, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడాయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినట్టేనా.? అయితే గనుక, కేసీయార్ వెంట కవిత వున్నట్లుగా, బీఆర్ఎస్ కార్యకలాపాల్లో కేటీయార్ ఎందుకు కనిపించడంలేదట.? ఈ విషయమై బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత పేరు తెరపైకి వచ్చిన దరిమిలా, దాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించే క్రమంలో అదే ఢిల్లీ వేదికగా కవితతో కేసీయార్ హంగామా చేయిస్తున్నారని అర్థం చేసుకోవాలేమో. CM KCR Inaugurated BRS National Office In Delhi ఇంకోపక్క కవిత గతంలో ఎంపీగా పని చేశారు. అలా జాతీయ స్థాయి నేతలతో ఆమె రాజకీయంగా సన్నిహిత సంబంధాలేరప్పడ్డాయి. ఆ కోణంలోనూ బీఆర్ఎస్ వ్యవహారాల్లో వ్యూహాత్మకంగా కవితకు ఢిల్లీ స్థాయి బాధ్యతల్ని కేసీయార్ అప్పగించారని అర్థం చేసుకోవాలేమో.! కేటీయార్‌కి తెలంగాణ బాధ్యతలు..