UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 వాలంటీర్లకు టీడీపీ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థను వైసీపీ సర్కారు ప్రయోగాత్మకంగా తెరపైకి తెచ్చింది. వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలే.! ఈ విషయాన్ని వైసీపీ ముఖ్య నేతలు పలు సందర్భాల్లో చెప్పారు, చెబుతూనే వున్నారు. వాలంటీర్ల పేరుతో వైసీపీ కార్యకర్తల కు ప్రభుత్వం నుంచి ‘గౌరవ వేతనం’ రూపంలో చెల్లింపులు జరుగుతుండడంపై నానా రకాల విమర్శలూ వస్తున్నాయి. మరోపక్క, వాలంటీర్ వ్యవస్థపై చాలా ఆరోపణలు కూడా లేకపోలేదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రతిసారీ వైసీపీ వాలంటీర్ వ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది. వాలంటీర్ వ్యవస్థను తీసెయ్యం: టీడీపీ మేం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగించబోమంటూ వాలంటీర్లకు టీడీపీ గుడ్ న్యూస్ చెప్పింది.

వారికి మరింత గౌరవమైన హోదా కల్పిస్తామనీ, ఆ వ్యవస్థలోని లోపాల్ని తాము అధికారంలోకి వచ్చాక సరిదిద్దుతామని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. కాగా, ఎన్నికల విధులకు సంబంధించి కొందరు వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా వుంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా వుంటే, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని వైసీపీ తరఫున ప్రచారం చేయించుకుంటోంది అధికార పార్టీ.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !