UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 ఆగ్నేయ అరేబియా సముద్రంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనం

ఇటీవల సంంభవించిన మాండస్ తుఫాను దాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఇది తీరం దాటి బలహీనపడినప్పటికీ ఆ ప్రభావం మాత్రం ఇంకా తగ్గిపోలేదు. ఫలితంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ, ఉత్తర తమిళనాడు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది.

ఆగ్నేయ అరేబియా సముద్రంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బుధవారం తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఇది మరింతగా బలపడి గురువారానికి తూర్పు మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలావుంటే, బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలని సుమిత్ర జలసంధిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడివుంది. ఇది వచ్చే రెండు మూడు రోజుల్లో పశ్చిమంగా పయనించి శ్రీలంకకు సమీపంలో ఈ వారాంతంలో అల్పపీడనంగా రూపాంతరం చెందే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !