UPDATES  

 వేడినీటితో స్నానం చేస్తే మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందా?

చలికాలం వచ్చిందంటే స్నానానికి తప్పనిసరిగా వేడినీరు ఉంటేనే స్నానం చేయాలనిపిస్తుంది. చల్లటి వాతావరణంలో చన్నీటి స్నానం ఇంకా వణుకు పుట్టిస్తుంది. వేడి నీటితో స్నానం చేస్తున్నకొద్దీ వెచ్చగా, హాయిగా అనిపిస్తుంది. ఇంకాస్త ఎక్కువ సేపు బాతింగ్ టబ్ లో గడపాలనిపిస్తుంది. అయితే శరీరం ఇలా తరచుగా వేడినీటికి గురికావడం వలన దుష్ప్రభావాలు ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పురుషులలో శుక్రకణాల సంఖ్య తగ్గుతుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. మగవారు ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేస్తే, వారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. వారానికి సుమారు 30 నిమిషాల పాటు వేడి నీటికి గురికావడం లేదా వేడికి పదే పదే బహిర్గతం కావడం పురుషులలో వంధ్యత్వానికి కారణమవుతుందని వెల్లడైంది. వేడినీటితో స్నానం చేసిన పురుషులందరిలో స్పెర్మ్ ఉత్పత్తి, వాటి చలనశీలత బలహీనపడింది. అదే సమయంలో చల్లటి నీటితో చేయడం వలన మూడు నుండి ఆరు నెలల తర్వాత మొత్తం సగటు స్పెర్మ్ కౌంట్ 491 శాతం పెరిగింది.

Hot Water Bath Affect Sperm- వేడి నీరు సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుంది? మగవారిలో సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్, అలాగే వీర్యం వృషణాలలో తయారవుతాయి. మంచి నాణ్యమైన స్పెర్మ్‌ను తయారు చేయడానికి వృషణాలు శరీరంలోని మిగతా భాగాల కంటే కొన్ని డిగ్రీలు చల్లగా ఉండాలి. ఎక్కువ వేడికి గురైనప్పుడు స్పెర్మ్ కణాలు చనిపోతాయి. అధిక ఉష్ణోగ్రతలకు నిరంతరం బహిర్గతం కావడం వల్ల వీర్యం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అలాగే అసాధారణ ఆకారంలో ఉన్న స్పెర్మ్ కణాల ఉత్పత్తి జరుగుతుంది. ఇది పురుషులలో వంధ్యత్వానికి దారితీస్తుంది. వృషణాల ఉష్ణోగ్రతలో కృత్రిమ పెరుగుదల స్పెర్మ్ కౌంట్, నాణ్యత రెండింటినీ తగ్గిస్తుందని అనేక ప్రయోగాత్మక అధ్యయనాలు చూపిస్తున్నాయి. Ways to Increase Sperm- మీ వృషణాలు వేడెక్కకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? – స్నానం చేయడం మంచిదే, కానీ హాట్ బాత్ టబ్బులలో కూర్చుని గడపటం, స్టీమ్ బాత్ లేదా ఆవిరి స్నానాలు చేయడం, వేడి నీటితో స్నానాలు చేయడం తగ్గించండి. హాట్ బాత్ టబ్ లో సుమారు 102 నుండి 104 ° F వరకు శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది, ఇది పురుషుల సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

– బిగుతుగా ఉండే లోదుస్తులు లేదా ప్యాంటు ధరించవద్దు. గాలి సక్రమంగా ప్రసరించే కాటన్ లోదుస్తులు, ప్యాంట్లు ధరించాలి. మీరు టైట్ జీన్స్ లేదా బ్రీఫ్‌లను ధరించినప్పుడు అది వృషణాల వద్ద వేడిని బంధించవచ్చు. వేసవి కాలంలో అయితే ఇది మరింత హాని చేస్తుంది. కాబట్టి సహజ ఫైబర్‌తో తయారు చేసిన బాక్సర్‌లు లేదా వదులుగా ఉండే ప్యాంట్‌లను ధరించండి. – ఎక్కువసేపు లేవకుండా కూర్చోవద్దు. పని చేయడం కోసం లేదా లాంగ్ డ్రైవింగ్ ట్రిప్‌లు లేదా మరేదైనా కార్యాచరణ కోసం, ఒకేచోట కూర్చోవడం వలన ఆది స్క్రోటమ్ చుట్టూ వేడిని రాజేస్తుంది. కాబట్టి మధ్యమధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ చుట్టూ నడవండి. – సుదీర్ఘమైన బైక్ రైడ్‌లను నివారించండి. బిగుతుగా ఉండే బైకింగ్ షార్ట్‌లు ధరించడం, బైక్ సీటుపై ఎక్కువసేపు కూర్చోవడం వలన స్క్రోటమ్ ప్రాంతం ఘర్షణకు కారణమవుతుంది. ఇది వృషణాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగించవచ్చు. బదులుగా, వదులుగా ఉండే షార్ట్‌లను ధరించండి, లాంగ్ బైక్ రైడ్‌లను తగ్గించండి లేదా లాంగ్ రైడ్‌లలో విరామాలు తీసుకోండి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !