UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 నైట్ టైంలో లైట్‌గా ఆకలేస్తే చేసేయండిలా!

రాత్రి భోజనం చేసినపుడు కూడా కొన్నిసార్లు అర్ధరాత్రి వేళ ఆకలి వేస్తుంది. ఆ ఆకలి మీద ధ్యాసతో నిద్రను కోల్పోతాము. ఇలాంటి సమయంలో మరీ కడుపు టైట్ అయ్యేలా కాకుండా, లైట్‌గా ఏదైనా తినేస్తే కడుపులో ఆత్మరాముడు శాంతిస్తాడు.

మరి అప్పటికప్పుడు ఏం తినాలి అని ఆలోచిస్తున్నారా? ముర్కులు, చిప్స్ లాంటివి ఏవైనా తింటే అవి ఆయిల్ ఫుడ్ కాబట్టి వాటితో కొలెస్ట్రాల్ పెరిగే సమస్యలు ఉంటాయి. రెండు నిమిషాల్లో మ్యాగీ చేయాలనుకున్నా ఆ టైంలో పొయ్యి వెలిగించి నూడుల్స్ చేసుకునేంత ఓపిక, ఆసక్తి ఉండవు. సింపుల్ ఐడియా ఒకటి చెప్పాలంటే, మీ ఫ్రిజ్‌లో నుంచి రెండు బ్రెడ్ ముక్కలు, కొన్ని కూరగాయలను తీసుకొని ఫటాఫట్ శాండ్‌విచ్ చేసుకొని, ధనాధన్ తినేసి చుప్‌చాప్‌గా పడుకోవచ్చు. మళ్లీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయానికే నిద్రలేవవచ్చు.

అంతా ఓకే గానీ శాండ్‌విచ్ ఎలా చేసుకోవాలి అనుకుంటున్నారా? శాండ్‌విచ్ చేయటానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక సులభమైన వెజిటెబుల్ శాండ్‌విచ్ రెసిపీని అందిస్తున్నాం. ఏమేం కావాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ సూచనలు ఇచ్చాం. జస్ట్ వీటిని ఫాలో అయితే చాలు.

Quick Vegetable Sandwich Recipe కోసం కావలసినవి

రెండు బ్రెడ్ ముక్కలు
దోసకాయ ముక్కలు
వెజ్ మయోన్నైస్
టొమాటో సాస్
వెన్న
మిరియాల పొడి
ఉప్పు
వెజిటెబుల్ శాండ్‌విచ్ తయారు చేసే విధానం

ముందుగా బ్రెడ్ ముక్కలను తీసుకొని వాటికి వెన్న రాయండి.
ఆపై అవే ముక్కలను కొద్దిగా టొమాటో సాస్, ఒక టీస్పూన్ వెజ్ మయోనైస్ అప్లై చేయాలి.
ఒక దోసకాయను వృతాకారంలో ముక్కలుగా కట్ చేసుకొని ఒక బ్రెడ్ మీద పెట్టుకోవాలి.
ఆపై రుచికోసం వాటిపైన మిరియాల పొడి, ఉప్పు చల్లుకోవాలి.
చివరగా మరో బ్రెడ్ ముక్కతో కప్పేస్తే, శాండ్‌విచ్ రెడీ.
ఇంకేంటి తినేసి, పడుకోండి. అంతే!

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !