బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ పెళ్లి తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మరింత రెచ్చిపోతోంది. ఆ మధ్య గెహరాయియా మూవీలో సిద్ధాంత్ చతుర్వేదితో స్క్రీన్‌పై చేసిన రొమాన్స్ చాలా మందిని షాక్‌కు గురి చేసింది. పెళ్లి తర్వాత మరీ ఇలా రొమాంటిక్ సీన్స్‌లో నటించడమేంటని చాలా మంది ఆమెపై విమర్శలు గుప్పించారు. ఇక తాజాగా షారుక్‌ఖాన్‌తో కలిసి నటించిన పఠాన్ మూవీలో నుంచి వచ్చిన బేషరమ్ రంగ్ సాంగ్‌పై కూడా మరోసారి అలాంటి విమర్శలే వస్తున్నాయి. ఈ పాటలో దీపికా రెచ్చిపోయి నటించింది. ఆమె వేసుకున్న డ్రెస్సులు, వేసిన స్టెప్పులపై దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఈ పాట మొత్తం రంగురంగుల బికినీల్లో దీపికా అందాల విందు చేసింది.
టాప్, బాటమ్ అన్న తేడా లేకుండా విచ్చలవిడిగా చూపించేసింది. దీంతో ఈ పాటకు ఒక్క రోజులోనే సుమారు 3 కోట్ల హిట్స్ రావడం విశేషం. అయితే అదే రేంజ్‌లో ట్రోలింగ్ కూడా నడుస్తోంది. ఒక్క పాటలో మరీ ఇన్ని బికినీలా? మరీ ఈ రేంజ్‌లో స్కిన్ షో చేయాలా? అంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మంత్రి కూడా ఈ మూవీ మేకర్స్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇందులో దీపికతోపాటు షారుక్ డ్రెస్సింగ్, ఆ రంగులు మార్చకపోతే తమ రాష్ట్రంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలా వద్దా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఇటు చాలా మంది ఫ్యాన్స్ కూడా టూమచ్ దీపికా అంటూ కామెంట్లు చేస్తున్నారు. పఠాన్ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా వచ్చే జనవరి 25న రిలీజ్ కాబోతోంది.