UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 కేసీఆర్ కు గట్టి షాక్

కేసీఆర్ ఎంతో అనుకున్నారు.. ఎంతో ఊహించారు. కానీ జాతీయ స్థాయిలో మందిలో కలవని కేసీఆర్ కు ఇప్పుడు ఎవరూ కలిసిరాలేదు. బీఆర్ఎస్ ప్రారంభోత్సవానికి దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీల నేతలు డుమ్మా కొట్టారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామని బయలు దేరిన కేసీఆర్ ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి ప్రత్యేక చార్టెడ్ విమానాలు రెడీ చేయించారు. ఢిల్లీలో ప్రముఖ హోటల్స్ బుక్ చేయించారు. నేతలందరూ వస్తే తన సత్తా చూపిద్దామని అనుకున్నారు. కానీ కట్ చేస్తే కేసీఆర్ ఆశించిన నేతలు ఎవరూ రాలేదు. ఇది ఖచ్చితంగా కేసీఆర్ కు గట్టి షాక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కేసీఆర్ కు దగ్గరివారు రాలేదు. కేవలం ఎప్పుడూ వచ్చే జేడీఎస్ అధినేత కుమారస్వామి, కొత్తగా ఎస్పీ అధినేత అఖిలేష్ కుమార్ మాత్రమే హాజరయ్యారు. కేసీఆర్ జాతీయ పార్టీ తొలి అడుగులే తడబడ్డాయని చెప్పొచ్చు. బీజేపీకి వ్యతిరేకంగా నడుం బిగించిన కేసీఆర్ వెంట.. ఆ బీజేపీ వ్యతిరేకించే బలమైన నేతలు రాకపోవడం చర్చనీయాంశమైంది.

దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ జాతీయ భవనం నిర్మాణం పూర్తి చేసి కేసీఆర్ ప్రారంభించారు. రాజశ్యామల యాగం, చండీ హోమం నిర్వహించి మరీ ప్రారంభోత్సవం నిర్వహించారు. అయితే కేసీఆర్ ఇందుకోసం దేశంలోని ప్రముఖ నేతలను రప్పించి తన బలం నిరూపించాలని అనుకున్నారు. కానీ ఆయన అనుకున్న నేతలు ఎవరూ రాలేదు.

బీజేపీతో మొదటి నుంచి పోరాడుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీఎం కేసీఆర్ తో కలిసి రాలేదు. ఇక మొన్నీమధ్యనే కలిసి వచ్చిన బీహార్ సీఎం నితీష్ కూడా కేసీఆర్ పార్టీ వేడుకకు హాజరు కాలేదు. బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ కూడా ఇటువైపు తొంగి చూడకపోవడం చర్చనీయాంశమైంది. ఇక జార్ఖండ్ సీఎం, తమిళనాడు సీఎం స్టాలిన్ వంటి వారు కూడా కేసీఆర్ వెంటన నడవలేదు. వీరిద్దరూ కాంగ్రెస్ కు దగ్గరగా ఉంటున్నారు.

అయితే వీరందరినీ కేసీఆర్ ఆహ్వానించాడా? లేదా? అన్నది మాత్రం తెలియదు. అయితే ఇంత పెద్ద ఈవెంట్ కు ఖచ్చితంగా కేసీఆర్ ఆహ్వానించి ఉంటాడని.. వాళ్లే కేసీఆర్ కు మొహం చాటేశారని ప్రచారం సాగుతోంది. కేసీఆర్ కు దగ్గరైన నేతలు కూడా బీఆర్ఎస్ ప్రారంభోత్సవంలో కనిపించకపోయేసరికి బీజేపీకి ప్రత్యామ్మాయంగా ఎదగాలనుకుంటున్న ఆయన తొలి అడుగులు గట్టిగా పడలేదనే చెప్పాలి. కేసీఆర్ ను నమ్మి రావడానికి ప్రాంతీయ పార్టీల నేతలు తటపటాయిస్తున్నట్టు అర్థమవుతోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !