UPDATES  

 అమిత్ షా మధ్యవర్తిత్వం .. వివాదం ఉద్రిక్తం

సరిహద్దు సమస్య పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున, ఆరుగురు సభ్యులతో మంత్రుల కమిటీ ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర, కర్నాటక అంగీకరించాయి. Maharashtra, Karnataka border issue: 1950ల నుంచి.. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటైన సమయంలో బెలగావి ప్రాంతంలోని మరాఠీ మాట్లాడే సుమారు 865 గ్రామాలను అన్యాయంగా కర్నాటకలో కలిపారని చాలా ఏళ్లుగా మహారాష్ట్ర వాదిస్తోంది. ఆ వాదనను కర్నాటక అంగీకరించడం లేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో నిర్ధారించిన సరిహద్దు రేఖనే అంతిమమని కర్నాటక స్పష్టం చేస్తోంది. బెలగావి తమదేనని నిర్ధారించడానికి అక్కడ ప్రత్యేకంగా విధాన సౌధను కూడా నిర్మించింది. ఈ సరిహద్దు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

\Maharashtra, Karnataka border issue: అమిత్ షా మధ్యవర్తిత్వం ఇటీవల ఈ వివాదం ఉద్రిక్తంగా మారింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన ట్రక్ లను కర్నాటకలో ధ్వంసం చేశారు. కర్నాటకలో తిరగనివ్వబోమని వాటిని అడ్డుకున్నారు. మరోవైపు, కర్నాటక బస్సులను పుణెలో శివసేన(ఉద్ధవ్ వర్గం) ధ్వంసం చేశారు. ఈ వివాదం రాజకీయంగా కూడా ఉద్రిక్తతలకు దారి తీసింది. రెండు రాష్ట్రాలు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు కావడంతో, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడుం బిగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో మహారాష్ట్రర సీఎం ఏక్ నాథ్ షిండే, కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కర్నాటక హోం మంత్రి కూడా పాల్గొన్నారు.

Maharashtra, Karnataka border issue: ముఖ్యమంత్రుల భేటీ సీఎంల సమావేశం అనంతరం ఆ వివరాలను అమిత్ షా మీడియాకు వెల్లడించారు. ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు సంయమనం పాటించాలని, సుప్రీం తీర్పును అంగీకరించాలని షా ఇరు రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేశారు. వీధి పోరాటాల ద్వారా ఈ సమస్య పరిష్కారం కాదని, అనవసరంగా దీన్ని రాజకీయాంశం చేయవద్దని సూచించారు. సమస్య పరిష్కారానికి సూచనలు చేసేందుకు రెండు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున, ఆరుగురు సభ్యులతో మంత్రుల కమిటీ ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ వివాదంపై సోషల్ మీడియాలో అనుచిత కామెంట్లు చేసినా, ఉద్రిక్తతలు పెరిగేలా పోస్ట్ లు పెట్టినా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !