ఒక విషయాన్ని సూటిగా చెప్పాలంటే పదునైన ఆయుధం ఏంటో తెలుసా? ‘కార్టూన్’. అవును. ఈనాడు దినపత్రికలో ‘శ్రీధర్’ సంధించిన కార్టున్ లు గతంలో ప్రభుత్వాలను షేక్ చేశాయి. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, వైఎస్ఆర్, సోనియా వరకూ అందరినీ బెంబేలెత్తించాయి. ఒక పెద్ద విషయాన్ని ఒక చిన్న చిత్రంలో సెటైరికల్ గా చెప్పడం అదో పెద్ద కళ. అలాంటి కళ ఇప్పుడు అంతరించిపోతోంది. ఈనాడులో ‘శ్రీధర్’ ఎగ్జిట్ అయ్యాక ఆ రేంజ్ లో కార్టూన్లు రావడం లేదు. ఇక ఇతర పత్రికల్లోనూ కాంప్రమైజింగ్ జర్నలిజం.. ప్రభుత్వాలకు భయపడిపోతుండడంతో కార్టూన్లు వేయలేకపోతున్నారు.
అయితే ఈ పదునైన అస్త్రానికి పదును పెట్టి ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ సంధిస్తున్నారు. ఇప్పుడది ఏపీ సీఎం జగన్ కు సూటిగా తగులుతోంది. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జగన్ ను ఇప్పుడు కార్టూన్లతో పవన్ కొడుతున్నాడు. జగన్ పై పవన్ కళ్యాణ్ మొదలుపెట్టిన ‘కార్టూన్’ ఫైట్ ఓరేంజ్ లో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీలోని సమస్యలపై సుతిమెత్తగా పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ‘కార్టూన్’ పంచులు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఒక్కో సమస్యపై మంచి కార్టూన్ తో జగన్ సర్కార్ వైఫల్యాన్ని ఎండగడుతున్న తీరు వైరల్ అవుతోంది. తాజాగా ‘ఏపీ మం
త్రులు అవినీతికి దూరంగా ఉండాలంటూ’ సీఎం జగన్ చేసిన కామెంట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వేసిన సెటైర్ అద్భుతంగా పేలింది. జగన్ కు, వైసీపీకి, చెంపపెట్టులా మారింది. ‘వైసిపి వారు తాము చేస్తున్న అవినీతికి కరప్షన్ హాలిడే ప్రకటించడం ఎంతైనా ప్రశంసనీయం..” అంటూ ట్విటర్ లో పవన్ కళ్యాణ్ సంధించిన సెటైర్ అదిరిపోయేలా ఉంది. అంతేకాదు.. ఇంతకీ ఆ కార్టూన్ బొమ్మలో ఏం ఉందంటే.. ‘సీఎం గారు అవినీతి విరామ పథకం ప్రకటించారు. లేదంటే ఈ పాటికి నీ కాంట్రాక్ట్ పని అయిపోయేది’ అని ఓ కాంట్రాక్టర్ తో వైసీపీ నేత చెబుతున్నట్టు ఉన్న ఈ కార్టూన్ ను పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. దీనికి అదిరిపోయే కొటేషన్ ఇవ్వడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ ఒక్క ట్వీట్ తో వైసీపీని బట్టలూడదీసి పవన్ నిలబెట్టినట్టుగా ఉంది. పవన్ డైలాగుల్లోనే కాదు.. పంచుల్లోనూ పవర్ ఉందని ఈ కార్టూన్ నిరూపించింది.