UPDATES  

NEWS

వినాయక మండపాల విద్యుత్ చార్జీలురూ.50వేలు చెల్లించిన ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పోలింగ్ స్టేషన్లు ఓటర్ లందరికీ సదుపాయకరంగా ఉండాలి : భద్రాచలం ఆర్డీవో మంగీలాల్ విగ్నేశ్వరుడి దయ అందరిపై ఉండాలి * ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ప్రజాపంథా పార్టీ డివిజన్ కార్యదర్శి కొండా చరణ్ అరెస్ట్ క్రీడా ప్రాంగణం స్థలం కబ్జా ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి. జీఎంని కలిసిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం అసంగటిత కార్మికుల పక్షాన పోరాడిన యోధుడు, కా,, ముక్తార్ పాషా. కాంట్రాక్టు కార్మికులకు సింగరేణి ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలి అన్ని దానాల కన్న అన్నదానం గొప్పది

 ఇండియన్‌ సినిమా సత్తా ఏంటో చాటుతోంది ఆర్‌ఆర్ఆర్‌

ఇండియన్‌ సినిమా సత్తా ఏంటో చాటుతోంది ఆర్‌ఆర్ఆర్‌. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీ సృష్టిస్తున్న సంచలనాలకు అడ్డే లేకుండా పోతోంది. యూకే, అమెరికా, జపాన్‌లాంటి దేశాల్లో ట్రిపుల్‌ ఆర్‌ మాయ చేస్తోంది. ఇప్పటికే ఇంటర్నేషనల్‌ లెవల్లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకోవడంతోపాటు గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్స్‌ ఛాయిస్ అవార్డుల్లో నామినేషన్లు కూడా పొందింది. తాజాగా యూకే బెస్ట్‌ మూవీస్‌ 2022 లిస్ట్‌లోనూ ఈ సినిమా చోటు దక్కించుకుంది. బ్రిటిష్‌ మ్యాగజైన ది గార్డియన్‌ ఈ మధ్యే 2022లో వచ్చిన 50 బెస్ట్‌ ఫిల్మ్స్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌కు కూడా స్థానం కల్పించింది. ఈ జాబితాలో 2022లో యూకేలో రిలీజైన సినిమాలు ఉన్నాయి.

అంతేకాదు టాప్‌ 10లో ట్రిపుల్‌ ఆర్‌ నిలవడం విశేషం. రాజమౌళి సృష్టించిన ఈ అద్భుతానికి ఏడో స్థానం దక్కింది. ఈ ఏడాది హాలీవుడ్‌లో రిలీజైన టాప్‌ గన్‌ మావెరిక్‌, గ్లాస్‌ ఆనియన్‌: ఎ నైవ్స్‌ ఔట్‌ మిస్టరీ, కౌ, ఫైర్‌ ఆఫ్‌ లవ్‌, ది నార్త్‌మ్యాన్‌, బోన్స్‌ అండ్‌ ఆల్‌, ది వండర్‌లాంటి మూవీస్‌ కంటే కూడా పైన ఉంది ఈ ఆర్ఆర్‌ఆర్‌. ఈ లిస్ట్‌లో టాప్‌ 6లో ఉన్న మూవీస్‌ లిస్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. ఇక ఈ సినిమాలో లీడ్‌ రోల్స్‌ నటించిన జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కూడా యూకే టాప్‌ 50 సౌత్‌ ఏషియన్‌ స్టార్స్‌ లిస్ట్‌లో టాప్‌లో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడా మూవీకి కూడా టాప్‌ 10లో చోటు దక్కింది. దీనికి తోడు గోల్డెన్‌ గ్లోబ్స్‌, క్రిటిక్స్ ఛాయిస్‌ అవార్డుల్లో నామినేషన్లతో ట్రిపుల్‌ ఆర్‌ మరో లెవల్‌కు చేరుకుంది. ఇక మిగిలింది ఆస్కార్స్‌ నామినేషన్లే. దీనికోసం రాజమౌళితోపాటు మేకర్స్‌ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రూ.50 కోట్ల వరకూ ఖర్చు కూడా చేసినట్లు సమాచారం.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !