UPDATES  

NEWS

పలు శుభకార్యాలకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు ఘనంగా తెలంగాణ రాష్ట్రఅవతరణ దశాబ్ది ఉత్సవాలు జాతీయ పథకాన్ని ఆవిష్కరించుకున్న ప్రభుత్వ విప్ రేగా జిల్లా కలెక్టర్ అనుదిప్ తెలంగాణ రైతు దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ చదువు నేర్పేందుకు ఏర్పాటుచేసిన రేకుల షెడ్డు తొలగించడం సరికాదు కమలాపురం గ్రామ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క* నవ దంపతులను ఆశీర్వదించిన జెడ్పీ చైర్మన్ కోరం కంటి వెలుగుతో కంటి సమస్యలను పరిష్కరించుకోండి… మద్దుకూరు సర్పంచ్ పద్దం వినోద్… నూతన వధూవరులను ఆశీర్వదించిన కుడుముల లక్ష్మీనారాయణ పిఏసిఎస్ డైరెక్టర్ ను పరామర్శించిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మంచి మనసున్నోడు మనోహర్ బాబు

 AVATAR 2 టీమ్‌కు గట్టి షాక్.. విడుదలకు ముందే లీక్

హాలీవుడ్ ప్రఖ్యాత డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహించిన అవతార్-2 ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. భారత్‌లో కూడా ఈ సినిమా ప్రభావం గట్టిగా ఉంది. ఇప్పటికే భారీ స్థాయిలో టికెట్ బుకింగ్స్ చేసుకున్నారు సినీ ప్రియులు. మల్టిప్లెక్సుల్లో ఈ సినిమా రికార్డు స్థాయిలో అడ్వాన్సెడ్ బుకింగ్స్ క్రియేట్ చేసింది. ఎన్నో అంచనాల నడుమ శుక్రవారం విడుదల కాబోతున్న తరుణంలో ఈ మూవీ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. విడుదలకు ముందే ఈ సినిమా ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. కొంతమది సైబర్ కేటుగాళ్లు అవతార్-2ను పైరసీ చేసి టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.

దీంతో విడుదల వరకు ఆగకుండా చాలా మంది ఉచితంగా సినిమాను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. రూ.2000 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను ఫ్రీగా చూసేస్తున్నారు. అవతార్ మొదటి పార్ట్ అప్పుడు కూడా ఇదే రకంగా పైరసీ భూతం వెంటాడింది. తాజాగా ఈ చిత్రంపై కూడా వసూళ్ల ప్రభావాన్ని చూపిస్తుంది. అవతార్-2 పైరసీ రూపంలో ఆన్‌లైన్‌లో దొరుకుతుండటంతో చాలా మంది డౌన్ లౌడ్ చేసుకుంటున్నారు. ఇదే సమంయలో సినీ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా థియేటర్లలో చూసే సినిమా అని, వేలాది కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కిస్తే పైరసీ చేయడం సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు. విడుదలకు ముందే సినిమా పైరసీ కావడంచో వసూళ్లపై ప్రభావం పడే అవకాశముందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. 2009లో అవతార్ సినిమా విడుదలయ్యే అదిరిపోయే వసూళ్లను సాధించింది. తొలి భాగంలో కనిపించిన జేక్, నేత్రి మళ్లీ సందడి చేయనున్నారు. పండోరా ప్రపంచాన్ని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించిన జేమ్స్ కేమరూన్.. ఈ సారి పండోరా సముద్ర ప్రపంచాన్ని పరిచయం చేయనున్నారు. సముద్రానికి సంబంధించిన ఎన్నో విశేషాలను ఆయన ఇందులో చూపించనున్నారు. మరి అక్కడ ఎలాంటి పోరాటం జరిగింది? సముద్రం వద్దకు నేత్రి, జేక్ కుటుంబం ఎందుకు వస్తుంది? లాంటివి తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !