UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 పవన్ మూవీ నుంచి POOJA HEGDE తప్పుకుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్‌, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన ఛాన్స్ దక్కించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఏ భాషలో చేస్తూన్న ఆమెకు బ్రేక్ వచ్చింది మాత్రం టాలీవుడ్‌లోనే. అయితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. తాజా నివేదికల ప్రకారం త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మూవీ మినహా టాలీవుడ్‌లో ఆమె మరో సినిమాకు సంతకం చేయలేదని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ సినిమా నుంచి కూడా ఆమె తప్పుకున్నట్లు సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్‍స్టార్ ఉస్తాద్ భగత్‌సింగ్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.

ఈ చిత్రంతో తొలుత పూజా హెగ్డేనే హీరోయిన్‌గా తీసుకున్నారు మేకర్స్. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె పవన్‌కల్యాణ్ మూవీలో నటించటం లేదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబీ 28లో బిజీగా ఉన్న కారణంగా.. పవర్ స్టార్ మూవీకి డేట్స్ సర్దుబాటు చేయలేక సినిమా వద్దనుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క పూజా హెగ్డే నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో తెలుగు దర్శక, నిర్మాతలు ఆమెను ఐరన్ లెగ్‌గా భావిస్తున్నారు. ఈ ఏడాది ఆమె రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాల్లో నటించగా.. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రేక్షకులను అలరించలేదు.

దీంతో నిర్మాతలు పూజాతో సినిమాకు వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇతర భాషల్లో మాత్రం మన బుట్ట బొమ్మలు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. పవన్-హరీష్ శంకర్ సినిమాలో పూజా స్థానంలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీలను తీసుకోనున్నట్లు సమచారం. ఏదేమైనప్పటికీ ఈ సినిమా గురించి చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేనీ, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్‌స్టార్ కెరీర్ అత్యుత్తమ ఆల్బమ్‌లు ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. వచ్చేఏడాది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !