ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. 2023 సంవత్సరంలో ఉద్యోగులకు అందించే సెలవులపై స్పష్టత ఇచ్చింది. సాధారణ, ఆప్షనల్ సెలవుల వివరాలు వెల్లడించింది. దీంతో వచ్చే సంవత్సరం ఉద్యోగులకు అందనున్న సెలవుల గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సెలవులను తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఏపీ కూడా తన క్యాలెండర్ ప్రకారం సెలవులపై సూచించింది. ప్రతి సంవత్సరం ప్రభుత్వం సెలవులు మంజూరు చేయడం మామూలే. ఆ సంవత్సరంలో వచ్చే ఆదివారాలు, పండుగలు, జాతీయ పండుగల రోజులను సెలవులుగా మార్చడం కామనే. ఇందులో భాగంగానే ఏపీ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఈ మేరకు సెలవులు దక్కనున్నాయి. AP Govt Holidays ప్రతి సంవత్సరం సాధారణ సెలవులు, ఆప్షనల్ సెలవులు అని రెండు రకాలుంటాయి. సాధారణ సెలవులంటే కచ్చితంగా ఇవ్వాల్సినవి. పండుగలు, జాతీయ పండుగలు లాంటివి. ఆప్షనల్ సెలవులు అంటే అవి ఆయా శాఖలకు సంబంధించినవి. వాటిని మన ఇష్టం ఉంటే తీసుకోవచ్చు.
లేదంటే మానుకోవచ్చు. ఉదాహరణకు వరలక్ష్మీ వ్రతం ఉంటే కొందరు సెలవు తీసుకుంటారు. మరికొందరైతే అవసరం లేదనుకుంటారు. మన ఇష్టానుసారంగా తీసుకునేవి ఆప్షనల్ సెలవులుగా భావించొచ్చు. సాధారణ సెలవుల జాబితాలో సంక్రాంతి, హోళీ, ఉగాది, తొలి ఏకాదశి, వినాయక చవితి, రాఖీ పౌర్ణమి, దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ పండుగలు ఉంటాయి. నూతన సంవత్సరం, మహావీర్ జయంతి, వరలక్ష్మీ వ్రతం లాంటి వాటని ఆప్షనల్ సెలవులుగా పేర్కొంటారు. 2023లో మొత్తం 23 రోజులు సాధారణ సెలవు దినాలుగా 22 రోజులను ఆప్షనల్ సెలవు దినాలుగా తేల్చారు. దీంతో సాధారణ, ఆప్షనల్ సెలవు దినాలను డిక్లేర్ చేయడంతో ఉద్యోగులు ఈ మేరకు తీసుకోనున్నారు. AP Govt Holidays 2023లో సెలవులు ప్రకటిస్తూ క్యాలెండర్ విడుదల చేయడంతో ఉద్యోగులు తమకు ఏ రోజులు కలిసొస్తున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కొన్ని పండుగలు ఆదివారం వస్తే సెలవు అందులో కలిసిపోతుందని భావిస్తుంటారు. ఐచ్ఛిక సెలవులు కూడా ఎప్పుడు ఉన్నాయనే దానిపై చర్చించుకుంటున్నారు. కొందరైతే సెలవుల కోసమే పని చేస్తారు. మరికొందరు విధి నిర్వహణకు అంకితమవుతుంటారు. మొత్తానికి ఏపీకి ప్రకటించిన సెలవులతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.