UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 తనకు గిట్టని ప్రధాని నరేద్రమోదీకి ముఖం చూపడానికి కూడా భయపడుతన్న తెలంగాణ ముఖ్యమంత్రి

తనకు గిట్టని ప్రధాని నరేద్రమోదీకి ముఖం చూపడానికి కూడా భయపడుతన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు.. కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే ఎజెండాగా టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఎన్నికల సంఘం కూడా దీనికి ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 14 ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు కేసీఆర్‌. మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న ఆయన పార్టీ విస్తరణపై దృష్టిపెట్టారు. దక్షిణాదిన పుట్టిన పార్టీ అయినందున మొదట ఉత్తరాదిన విస్తరించాలనుకుంటున్నారు. ఉత్తరాదిన ఢిల్లీలో, దక్షిణాదిలో ఏపీలో పార్టీ విస్తరణ సులభమని గలాబీ బాస్‌ భావిస్తున్నారు. KCR ఏపీ బాధ్యతలు తలసానికి.. ఏపీలో బీఆర్‌ఎస్‌ విస్తరణ బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు కేసీఆర్‌ అప్పగించారు. ఏపీలో ఆయనకు ఉన్న బంధుత్వాల కారణంగా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ఏపీ సమస్యలపై ఇప్పుడు ఏదో విధంగా ప్రతిస్పందించకపోతే.. అనుకున్నంత ఎఫెక్ట్‌ రాదు.

ఏపీలో ఇప్పుడు ప్రధానమైన సమస్య.. అమరావతి లేదా మూడు రాజధానులు. ఈ అంశంపై కేసీఆర్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు కేటీఆర్‌ గతంలో మద్దతు పలికారు. అయితే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ అయింది. బీఆర్‌ఎస్‌ ఏపీలోనూ రాజకీయం చేయబోతోంది. ఇలాంటి సమయంలో అదే విధానానికి కట్టుబడి ఉన్నారా లేకపోతే.. అమరావతికి మద్దతు ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు.. ప్రజాసంఘాలు.. అమరావతికే మద్దతు ప్రకటించాయి. బీజేపీ, కాంగ్రెస్‌ కూడా అమరావతికే మద్దతు ప్రకటించాయి. ఒక్క వైసీపీ మాత్రమే మూడు రాజధానులంటోంది. ఇప్పుడు వైసీపీ వైపు కేసీఆర్‌ ఉంటారా లేకపోతే.. అమరావతి వైపా అన్నది తేల్చుకుంటే.. పార్టీ విస్తరణకు మార్గం సుగమం చేసుకున్నట్లే.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !